దూసుకెళ్తున్న ”మహావతార్ నరసింహ”

Friday, December 5, 2025

హొంబాలే ఫిలింస్ అనే నిర్మాణ సంస్థ నుంచి వచ్చే సినిమాలపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు వేరే లెవెల్లో ఉంటాయి. ‘కేజీఎఫ్’, ‘కాంతారా’ లాంటి బ్లాక్‌బస్టర్లతో ఈ బ్యానర్ క్రేజ్ రెట్టింపు అయింది. ఇప్పుడీ సంస్థ ఒక డిఫరెంట్ దిశలో ప్రయోగం చేసింది. తాజాగా ‘మహావతార్ నరసింహ’ అనే యానిమేటెడ్ డివోషనల్ సినిమా తెరపైకి తీసుకువచ్చింది.

ఇది పెద్దగా ప్రమోషన్ లేకుండా, తక్కువ థియేటర్లలోనే విడుదలయినప్పటికీ, కంటెంట్ బలంగా ఉండటంతో ఆడియెన్స్ మనసు దోచుకుంది. కథా విషయానికొస్తే… ఇది నరసింహ అవతార్ ఆధారంగా రూపొందిన సినిమా. టెక్నికల్‌గా మంచి క్వాలిటీతో చేసిన ఈ యానిమేటెడ్ మూవీని ఫ్యామిలీ ఆడియెన్స్, డివోషనల్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా చూశారు.

రిలీజ్ అయిన తొలి వారాంతంలోనే సినిమాకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఆదివారం ఒక్క రోజే దాదాపు 11.25 కోట్లు రాబట్టడం ఓ యానిమేషన్ సినిమాకు బిగ్ అచీవ్‌మెంట్‌గా చెప్పొచ్చు. తక్కువ బడ్జెట్, తక్కువ ప్రమోషన్‌తో వచ్చిన ఈ సినిమాకు ఇంత రెస్పాన్స్ రావడం హొంబాలే సంస్థకు ఓ సాలిడ్ బూస్ట్ లా మారింది.

ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నా… అదే సమయంలో ‘మహావతార్ నరసింహ’లాంటి డివోషనల్ యానిమేషన్ సినిమా కూడా థియేటర్ల దగ్గర జనాన్ని ఆకర్షించటం అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.

హొంబాలే ఫిలింస్ ఈ సినిమాతో డిఫరెంట్ జనర్లోకి ఎంటర్ అయ్యింది. యానిమేషన్‌, డివోషన్, కల్చరల్ ఎలిమెంట్స్ అన్నీ కలిపి మంచి ప్రయోగం చేసింది. దీనికి ప్రేక్షకుల స్పందన చూస్తే… ఫ్యూచర్‌లో ఇలాంటి మౌళిక కథలతో మరిన్ని ప్రయోగాలు చేయాలనే ఉత్సాహం వారికి రావడం ఖాయం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles