మొట్టమొదటిసారిగా రాజకీయ యాక్టివిటీలోకి వైఎస్ భారతి!

Friday, December 5, 2025

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య.. వైఎస్ భారతి మొట్టమొదటి సారిగా పార్టీ తరఫున ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన బోతున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో.. స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే వంటి రోజుల్లో గవర్నరు రాజ్ భవన్ లో హైటీ ఏర్పాటు చేసి ప్రముఖులందరినీ ఆహ్వానించినప్పుడు.. ముఖ్యమంత్రితో కలిసి ఆయన భార్యగా అక్కడకు వెళ్లడం వేరు. 11 మంది ఎమ్మెల్యేలున్న పార్టీకి నాయకుడిగా.. రాష్ట్రంలో పరిస్థితుల గురించి రాజకీయ ఆరోపణలు చేయడానికి గవర్నరు నజీర్ వద్దకు వెళుతున్న  భర్తతో తాను కూడా కలిసి అక్కడకు వెళ్లడం వేరు. అందుకే.. వైఎస్ షర్మిల మొదటి రాజకీయ కార్యక్రమంగా దీనిని పలువురు భావిస్తున్నారు. దీని వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉండవచ్చునని కూడా అనుకుంటున్నారు.

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. గవర్నరు అబ్దుల్ నజీర్ ను కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గురించి ఆయనకు వివరించడానికే అపాయింట్మెంట్ తీసుకున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు.. వివిధ రకాల కేసుల్లో వరుసగా అరెస్టు అవుతూ ఉండడంతో.. పార్టీ అధినేత ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వరుస అరెస్టులు మాత్రమే కాకుండా.. విచారణలో వెల్లడవుతున్న వాస్తవాలు కూడా ఆయనకు మరింత ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తనకు ఇబ్బందులు వస్తాయేమోననే భయంతో.. ప్రభుత్వం మీద పితూరీలు చెప్పడానికి జగన్ గవర్నరు అపాయింట్మెంట్ తీసుకున్నారని పలువురు భావిస్తున్నారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు అడుగంటిపోయాయని, తక్షణం ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని ఒక పసలేని డిమాండ్ ను జగన్ కొన్ని నెలల నుంచి వినిపిస్తూనే ఉన్నారు. తమాషా ఏంటంటే.. జగన్మోహన్ రెడ్డి తన పరామర్శ, కంటితుడుపు యాత్రలు పెట్టుకున్నప్పుడు తప్ప శాంతి భద్రతల సమస్య తలెత్తిన సందర్భాలే రాష్ట్రంలో లేవు. శాంతి భద్రతలకు అసలు సమస్య ఆయనే కాగా, ఆయన మాత్రం గవర్నరును కలిసి తన పాచిపోయిన డిమాండును వినిపించడానికి సిద్ధమవుతున్నారు. పార్టీకి చెందిన కీలక నాయకులందరినీ తాడేపల్లి రప్పించినట్టుగా కూడా తెలుస్తోంది. అన్నింటికంటె పెద్ద ట్విస్టు.. గవర్నరుతో భేటీకి జగన్ వెంట ఆయన భార్య వైఎస్ భారతి కూడా వెళ్తుండడం. ఈ సమాచారాన్ని పార్టీ వర్గాలే లీక్ చేశాయి.

అదే జరిగితే.. వైఎస్ భారతి మొదటి రాజకీయ కార్యక్రమం ఇదే అవుతుంది. గవర్నరును కలిసినప్పుడు.. ప్రధానంగా లిక్కర్ కేసు గురించి జగన్ ప్రస్తావించవచ్చునని అనుకుంటున్నారు. లేని స్కామ్ లో తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని ఆయన పాత విమర్శలే అక్కడ చెప్తారు. అయితే ఆ కేసులో తన బండారం కూడా బయటపడేలా.. తన భారతి సిమెంట్స్ లోని శాశ్వత డైరెక్టరు గోవిందప్ప బాలాజీ ప్రస్తుతం రిమాండులో ఉన్నందున.. తన కష్టం చెప్పుకోవడానికి భారతి కూడా వెళుతున్నట్టుగా కొందరు అనుమానిస్తున్నారు. మరి గవర్నరుతో భేటీ తర్వాత గానీ.. ఈ విషయంలో మరింత క్లారిటీ రాకపోవచ్చు అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles