మోతెవరి లవ్‌ స్టోరీ ట్రైలర్‌ విడుదల చేసిన స్టార్‌ డైరెక్టర్‌!

Friday, December 5, 2025

ఒకప్పుడు యూట్యూబ్ ద్వారా హాస్యంతో ఆకట్టుకున్న “మై విలేజ్ షో” టీం, ఇప్పుడు ఓ వెబ్‌సిరీస్ రూపంలో కొత్త ప్రయోగం చేశారు. ఆగస్ట్ 8న ZEE5 ఓటీటీలో రిలీజ్ కానున్న “మోతెవరి లవ్ స్టోరీ” అనే ఈ సిరీస్, పూర్తిగా తెలంగాణ గ్రామీణ వాతావరణాన్ని ఆధారంగా తీసుకొని రూపొందించబడింది.

ఈ సిరీస్‌లో అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ముఖ్య పాత్రల్లో నటించగా, దర్శకత్వ బాధ్యతలను శివ కృష్ణ బుర్రా నిర్వర్తించారు. మొత్తం ఏడూ ఎపిసోడ్లుగా రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ సిరీస్, ప్రేమ, హాస్యం, గ్రామీణ రంగుల మేళవింపుతో ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్ చూసినవారంతా కథనంలో ఆత్మీయత కనిపిస్తోందని భావిస్తున్నారు.

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు దర్శకుడు తరుణ్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనిల్ గీలా ఈ సందర్భంగా మాట్లాడుతూ – ఇంతవరకూ చేసిన ప్రయాణం కష్టాలతొ కూడినదే అయినా, ఇలాంటి అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. మై విలేజ్ షో టీంగా కలిసి చేసిన ప్రెజెంట్ ప్రయోగమే మోతెవరి లవ్ స్టోరీ అని చెప్పారు.

ఈ ప్రాజెక్టుకు మద్దతుగా నిలిచిన మధుర శ్రీధర్ మాట్లాడుతూ – తెలంగాణలో వచ్చే కొత్త కథలకు తరుణ్ భాస్కర్ లాంటి కంటెంటు మేకర్స్ స్ఫూర్తిగా ఉన్నారని అన్నారు. అలాగే మోతెవరి లవ్ స్టోరీ కూడా కొత్త ఫీల్ ఇస్తుందని, అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

సిరీస్‌ను నిర్మించిన శ్రీరామ్ శ్రీకాంత్, జీ5 తరపున సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయంత్, దర్శకుడు శివ కృష్ణ బుర్రా కూడా తమ అనుభూతులు వ్యక్తం చేస్తూ, ఇది ప్రతి ఒక్కరూ చూసేలా ఉండే కంటెంట్ అని తెలిపారు.

ఇంతవరకూ యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ టీం, ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫాం ద్వారా విభిన్నమైన కథతో ముందుకు వస్తున్నారు. ఆగస్ట్ 8న విడుదల కానున్న ఈ వినోదభరితమైన గ్రామీణ ప్రేమ కథ ఏ మేరకు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుందో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles