నిధులు వచ్చేలోగా విషం కక్కిన జగన్ దళాలు!

Friday, December 5, 2025

తల్లికి వందనం కార్యక్రమం కింద రాష్ట్రంలో పాఠశాలలకు, జూనియర్ కాలేజీలకు వెళ్లి చదువుకుంటున్న విద్యార్థుల తల్లులకు 15 వేల నిదులు ఏటా ఇస్తామని చెప్పిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది. పాఠశాలలు పునఃప్రారంభం అయిన రోజునే తల్లికి వందనం నిధుల విడుదలకు శ్రీకారం చుట్టారు. అయితే ఎస్సీ విద్యార్థుల విషయంలో కేంద్రం కొంత నిధులను సమకూరుస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రం నిధులు వచ్చేదాకా ఎదురుచూడకుండా.. తల్లికి వందనం హామీని నిలబెట్టుకోవడంలో ఆలస్యం జరగకుండా ఉండడం కోసం ఎన్డీయే కూటమి ప్రభుత్వం పాఠశాలలు తిరిగి తెరచినప్పుడే నిధులు పంపారు. ఎస్సీ విద్యార్థుల విషయంలో మాత్రం రాష్ట్రప్రభుత్వం వాటాగా ఇవ్వాల్సిన నిధులను అందజేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాగానే నేరుగా వారి ఖాతాలకు అందుతాయని అంటున్నారు. ఈలోగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. తల్లికి వందనం నిధులు ఇవ్వడంలో చాలా అక్రమాలు అరాచకాలు జరిగాయని, పేదలకు ద్రోహం చేశారని.. ఒక కుటిల ప్రచారం ప్రారంభించేసింది.
కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడానికి, విషం కక్కడానికి, ప్రజల బుర్రల్లోకి విషాన్ని ఎక్కించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంత అలర్ట్ గా పనిచేస్తున్నదో తెలుసుకోవడానికి ఇది మంచి ఉదాహరణ. రాష్ట్రప్రభుత్వం తల్లికి వందనం నిధులు విడుదల చేయడానికి, ఎస్సీ విద్యార్థులకు కేంద్రం వాటా నిధులు అంది రావడానికి మధ్య కేవలం కొన్ని రోజుల వ్యవధి మాత్రమే ఉంటుంది. అయితే ఈలోగా.. రాష్ట్రప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి, కేంద్రం వాటా నిధులు ఇంకా అందని నిరుపేద దళితుల్ని ఒక రకమైన భయభ్రాంతులకు గురిచేయడానికి వైసీపీ శతవిధాల ప్రయత్నం చేసింది.

ఎస్పీలకు మాత్రం ఇలా రాష్ట్ర వాటా నిధులు మాత్రమే అకౌంట్లలో పడ్డాయి. అయితే.. ఆ విషయాన్ని దాచిపెట్టి.. అన్ని వర్గాలకూ అన్యాయం జరుగుతున్నట్టుగా బురదచల్లుతూ.. తల్లికి వందనం నిధులు పూర్తిగా ఇవ్వడం లేదు, పేదలకు అన్యాయం చేస్తున్నారు.. అనే రకరకాల నిందారోపణలతో జగన్ దళాలు విచ్చలవిడిగా ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు గుప్పించారు. అలాగే ఆయనకు చెందిన సాక్షి లో కథనాలు, సాక్షీ టీవీలో ప్రత్యేక డిబేట్లు కూడా నిర్వహించారు. అయితే ఇదంతా కూడా.. కేంద్రం నిధులు వచ్చేసేలోగా.. బురద చల్లి బద్నాం చేయాలనే ప్రయత్నం మాత్రమే. పేదలను ఆందోళనకు గురిచేయాలన్న కుట్ర మాత్రమే.

ఈ విషయంలో సాంఘిక సంక్షేమ శాఖ తాజాగా స్పష్టత ఇస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేనేలేదని.. కేంద్రం వాటాగా రావాల్సి ఉన్న డబ్బులు 20 రోజుల్లోగా నేరుగా వారి ఖాతాలకు వచ్చేస్తాయని వారు వివరణ ఇచ్చారు. 9,10 తరగతులు చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు మాత్రమే కేంద్రం ఇలా ఒక వాటా డబ్బు ఇస్తుంది. వారి నిధులు వచ్చేదాకా ఆగకుండా.. స్కూళ్లు తెరచినప్పుడే తల్లికి వందనం నిధులు ఇవ్వడం మంచిదనే విశాల హృదయంతో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వ్యవహరించినందుకు వైసీపీ కుట్రలు చేసింది. అయితే సాంఘిక సంక్షేమ శాఖ వివరణతో.. 20 రోజుల్లోగా మిగిలిన నిధులు కూడా వస్తాయని ప్రజలు సంతోషంగానే ఉన్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles