ఏమీ తేల్చకుండానే వైసీపీ నేతకు వణుకు పుడుతోందా?

Friday, December 5, 2025

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన అనంతబాబు ఇప్పుడు హత్యకేసు పునర్విచారణ భయంతో వణుకుతున్నారు. దళితుడైన తన డ్రైవరును హత్యచేసి డోర్ డెలివరీ చేసిన కేసును, తాజాగా పునర్విచారణ చేయాలని ఎస్సీ ఎస్సీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో అనంతబాబులో ఈ వణుకు మొదలైనట్టుగా కనిపిస్తోంది. పునర్విచారణకు ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాంటూ ఆయన ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. రెండు మూడు రోజుల్లోగానే  బహుశా పోలీసులు తనను అరెస్టు చేస్తారని భయపడుతున్నారో ఏమో గానీ.. తన పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని కూడా హైకోర్టును అభ్యర్థిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు.. జగన్ పాలన సాగుతున్న రోజుల్లో తన దళిత డ్రైవరు సుబ్రమణ్యంను దారుణంగా హతమార్చినట్టుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. సుబ్రమణ్యంను చంపేసి.. తానే డ్రైవ్ చేసుకుంటూ తన కారులోనే హతుడి ఇంటికి రాత్రివేళ వచ్చి శవాన్ని అప్పగించి వెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై అప్పట్లోనే పోలీసు కేసులు నమోదు అయ్యాయి. డ్రైవరును తానే హత్య చేసినట్టు అనంతబాబు అంగీకరించారని కూడా అప్పట్లో పోలీసు ఉన్నతాధికారులు మీడియాకు వెల్లడించారు. ఆయనను అరెస్టు చేయడం కూడా జరిగింది. తర్వాత బెయిలుపై విడుదల అయ్యారు. బెయిలుపై జైలునుంచి బయటకు వస్తున్న సందర్భాన్ని పెద్ద ఉత్సవంలాగా నిర్వహించుకున్నారు అనంతబాబు. ఆయనను ఊరేగిస్తూ గజమాలలు వేస్తూ చాలా ఆర్భాటంగా వేలాదిగా తరలివచ్చిన వైఎస్సార్ సీపీ అభిమానులు తోడ్కొని వెళ్లారు. ఆ తర్వాత ఎటూ అధికారంలో ఉన్నది ఆయనకు సన్నిహితుడైన జగన్మోహన్ రెడ్డే గనుక.. కేసు విచారణ అతీగతీ లేకుండాపోయింది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. సుబ్రమణ్యం కుటుంబంలో మళ్లీ ఆశలు చిగురించాయి. తమ కుటుంబానికి న్యాయం జరుగుతుందనే ఆశ మొలకెత్తింది. సుబ్రమణ్యంను హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలంటూ వారు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వం వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేయడంతో పాటు, సుబ్రమణ్యం అన్నకు ఉద్యోగం కూడా ఇచ్చింది. అలాగే.. వారి తరఫున కేసు వాదించడానికి ముప్పాళ్ల సుబ్బారావు అనే న్యాయవాదిని కూడా నియమించింది.

కేసు పునర్విచారణకు ఉత్తర్వులు కావాలంటూ ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించడంతో అందుకు ఉత్తర్వులు వచ్చాయి. కేసును మళ్లీ విచారిస్తారనే వార్త వచ్చేసరికి అనంతబాబులో భయం మొదలైనట్టుగా ఉంది. పునర్విచారణకు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తదుపరి దర్యాప్తు చేపట్టడానికి ప్రాసిక్యూషన్ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు అని అనంతబాబు అంటున్నారు గానీ.. ఆధారాలు అనేవి దర్యాప్తు చేసిన తర్వాతనే కదా దొరుకుతాయి అని పలువురు భావిస్తున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles