మాస్టర్ మైండ్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో సహా. కీలకమైన వ్యక్తుల అరెస్టు అయిన నేపథ్యంలో వైఎస్ జగన్ కోటరీలో ఆందోళన, ఒత్తిడి పెరుగుతున్నాయి. ఇదే సమయంలో జగన్ చెల్లెలు షర్మిల కూడా లిక్కర్ వ్యాపారం ముసుగులో తన ప్రభుత్వం కాలంలో అన్నయ్య సాగించిన దందాను గురించి నిలదీస్తున్నారు. ఈ కుంభకోణం వెనుక ఉన్న కుట్రలను పూర్తిగా వెలికి తీయాలంటున్న ఆమె.. ప్రతిదశలోనూ అవినీతి చోటు చేసుకున్నదని, మొత్తం దందాకు జగనే సూత్రధారి అని అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ సూటిగా సమాధానం చెప్పాలంటూ షర్మిల ప్రధానంగా రెండు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఒకటి- లిక్కర్ పాలసీలో డిజిటల్ పేమెంట్స్ ను ఎందుకు నిలిపివేశారు. రెండు- ట్రస్టెడ్ లిక్కర్ అమ్మకాలను ఎందుకు బంద్ చేశారు? అని! ఈ రెపండు ప్రశ్నలకు జగన్ దగ్గర జవాబు ఉంటే గనుక.. ఆయన నిజాయితీగా వ్యవహరించినట్టే అని ప్రజలు అంటున్నారు.
లిక్కర్ కుంభకోణంలో జరిగిన దారుణాలు అన్నింటినీ సిట్ వెలుగులోకి తీయడం ఒక ఎత్తు. జగన్ సొంత చెల్లెలు.. అన్నయ్య దుర్మార్గాలను ఎండగడుతుండడం ఒక ఎత్తు అన్నట్టుగా ప్రస్తుతం పరిస్థితి ఉంది. పన్నులు ఎగ్గొట్టాలనే దురుద్దేశంతోనే మొత్తం క్యాష్ రూపంలో మాత్రమే అమ్మకాలు జరిగేలా చూశారు. నాన్ డ్యూటీ పేమెంట్లు మొత్తం బ్లాక్ లో జరిగాయి. బ్రాండెడ్ మద్యాన్ని నిలిపివేసి చీప్ లిక్కర్ ను మాత్రమే ప్రోత్సహించడం కూడా ఈ కుట్రలో భాగమే. దీనిని కేవలం మూడున్నర వేల కోట్ల రూపాయలు దిగమింగిన కేసుగాకాు.. ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయల పన్నులు ఎగవేసిన కేసుగా చూడాలో అధికారులు ఆలోచించాలి.. ఆ దిశగా లోతైన దర్యాప్తు సాగించాలి అని షర్మిల అంటున్నారు.
జగన్ పాలన కాలంలో కేవలం నాసిరకం చీప్ లిక్కర్ మాత్రమే అమ్మడం వలన రాష్ట్రంలో ఐదేళ్లలో 30 లక్షల మందికి కిడ్నీ సమస్యలు వచ్చాయని, 30 వేల మందికి పైగా చనిపోయారని ఆమె అంటున్నారు. నిజానికి కొన్ని రోజులుగా.. జగన్ హయాంలో మద్యం అమ్బకాల వలన దెబ్బతిన్న ప్రజల ఆరోగ్యం పోయిన ప్రాణాలు కూడా ప్రధానంగా చర్చలోకి వస్తున్నాయి. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా వీటిగురించి ప్రధానంగా ప్రస్తావించారు. అయినా జగన్ దళాలకు మాత్రం చీమకుట్టినట్టయినా లేదు. ఇప్పుడు షర్మిల అదే విషయాన్ని పునరుద్ఘాటిస్తున్నారు.
ఈ రెండూ ప్రధానమైనవి గానీ.. అన్నయ్యకు చెల్లెమ్మ ఇంకా అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. రుషికొండను ఎందుకు తవ్వారో ప్రజలకు చెప్పాలి. వివేకా హత్య కేసులో తొలుత హార్ట్ ఎటాక్ అని సాక్షి చానెల్ లో ఎందుకు ప్రసారం చేశారో చెప్పాలి.. అసలు విషయాల్ని మరుగున పెట్టి ప్రజల్ని మోసం చేయడం మానేయాలి అని షర్మిల నిలదీస్తున్నారు.
షర్మిలకు జగన్ జవాబులు చెప్పడం అనేది కల్లో మాట. తాను నిర్వహించిన ప్రెస్ మీట్ కు వచ్చిన విలేకరులు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పడమే అలవాటులేని జగన్.. బహిరంగంగా చెల్లెలు అడిగేవాటికి జవాబు చెప్పకుండా విస్మరించవచ్చు. కానీ ఆమె మాటలు ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తే గనుక.. ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా అంధకారం అయిపోతుంది.
షర్మిల రెండు ప్రశ్నలు.. ఆన్సర్ ఉందా జగన్!
Friday, December 5, 2025
