నెంబర్ టూ స్కామ్ నెల్లూరు క్వార్ట్స్ అవుతుందా?

Friday, December 5, 2025

జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అక్రమాలు, అరాచకాలు, అవినీతి వ్యవహారాలకు లెక్కేలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి వ్యవహారాలను పరిశీలిస్తూ ఉంటే.. పుట్టపిగిలినట్టుగా అంతూపొంతూ లేకుండా వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే మూడున్నర వేల కోట్ల రూపాయలు కాజేసిన లిక్కర్ కుంభకోణం దేశమంతా సంచలనం సృష్టిస్తోంది. దేశంలో అనేక రాష్ట్రాల్లో లిక్కర్ కుంభకోణాలు జరిగాయి గానీ.. ఇంతపెద్ద స్కామ్ ఎక్కడా జరగలేదని అంతా విస్తుపోతున్నారు. కాగా, ఏపీలో జగన్ హయాంలో జరిగిన రెండో అతిపెద్ద స్కామ్ ఏమిటి? అనే చర్చ ఇప్పుడు ప్రారంభం అవుతోంది. ఎందుకంటే.. నెల్లూరులో అక్రమమైనింనగ్, క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల బాగోతాలు ఇప్పుడు నిర్ఘాంతపరిచే స్థాయికి చేరుకుంటున్నాయి.
జగన్ పరిపాలన కాలంలో.. ఏకంగా ప్రభుత్వ పాలసీనే మార్చేసి దోపిడీకి అనుకూలంగా కొత్త విధానాలు తీసుకువచ్చిన  వ్యవహారాలు ప్రధానంగా రెండు ఉన్నాయి. ఒక్కటి లిక్కర్ పాలసీ కాగా, రెండోది ఇసుక పాలసీ. ఈ రెండు పద్ధతుల్లో వేల కోట్లు దోచుకోవచ్చుననేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కీలక దళాల ప్రణాళిక. దానికి తగ్గట్టుగానే ఆ రెండు వ్యాపారాల్లో కనీసం డిజిటల్ పేమెంట్లకు అవకాశం కూడా లేకుండా వారు పాలసీలను రూపొందించారు. తదనుగుణంగానే దోచుకున్నారు. మద్యం వ్యవహారంలో అక్రమాల మీద ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటుచేస్తే ఇప్పటికి మూడున్నర వేల కోట్లు స్వాహా చేసినట్టుగా తేల్చింది. నిందితులను గుర్తించింది. బిగ్ బాస్ కు అందిన అంతిమలబ్ధి వివరాలను కూడా సేకరించింది. వాటి ఆధారాలను కూడా పక్కాగా తయారుచేసి కోర్టు ముందు నిలబెట్టే ప్రయత్నంలో ఆల్రెడీ ప్రిలిమనరీ చార్జిషీటు కూడా దాఖలైంది. మరి దాని తర్వాత అంత పెద్దకుంభకోణం ఏదై ఉండొచ్చు. జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడిగా పర్యవేక్షించిన ఇసుకదోపిడీనే కదా అని చాలా మంది అనుకోవచ్చు. అందులో ఎంత దోచుకున్నారో ఇంకా లెక్క తేలలేదు. కానీ..ఈలోగా నెల్లూరు క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

చూడబోతే.. మద్యం కుంభకోణం తర్వాత రాష్ట్రంలో జగన్ పాలనలో ఇదే అతిపెద్ద కుంభకోణంగా మారే అవకాశం ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదో చిల్లర వ్యవహారంలాగా చిన్న కేసులాగా ఇది వెలుగులోకి వచ్చింది. అక్రమమైనింగ్ అనే ముసుగులో అనేక దందాలుంటాయి. కానీ.. ఒకటి రెండు అరెస్టుల తర్వాత వెల్లడవుతున్న వివరాలు గమనిస్తే అంతా నిర్ఘాంత పోతున్నారు. కేవలం ఇద్దరు మాజీ మంత్రులు అప్పట్లో తమ అనుచరులను అడ్డుగా పెట్టుకుని సాగించిన దందాలో ఇప్పటికే వందల కోట్ల స్వాహా పర్వాలు వెలుగు చూస్తున్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రులు కాకాణి గోవర్దనరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లు కలిసి బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి సహకారంతో నడిపించిన దందా ఇది. వారి చేతికి మట్టి అంటకుండా అంతా అనుచరుల ఖాతాల్లోంచే వసూళ్లు సాగించారు. ఒక్కొక్కరి ఖాతాల్లో వందల కోట్ల లావాదేవీలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యనేతగా జగన్మోహన్ రెడ్డికి చెందేలా నెలకు రూ20 కోట్ల వంతున, 9 నెలలలో 180 కోట్లు చేరవేసినట్టు కూడా తెలుస్తోంది. నిర్ఘాంతపోయిన అధికారులు ఇప్పుడు అక్రమమైనింగ్ తో పాటు మనీలాండరింగ్ కు సంబంధించిన కేసులను కూడా నమోదు చేసే ఆలోచనతో ఉన్నారు. మరికొన్ని రోజులు గడిస్తే గానీ.. ఒక్క నెల్లూరు జిల్లాలో క్వార్ట్జ్ ముసుగులో ఎన్ని వందల లేదా వేల కోట్లు కాజేశారో లెక్కతేలదని పలువురు అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles