పవన్ కళ్యాణ్ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్ షోలు ఇప్పటికే కొన్ని చోట్ల ప్రారంభమయ్యాయి. ఇక జూలై 24 నుంచి ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది.
ఇంతకాలంగా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కు ఇది పండుగలా మారింది. యాక్షన్, విజువల్స్, మ్యూజిక్ అన్నీ కలిపి ఓ మాస్ ట్రీట్‌గా ఈ సినిమా తెరపై ఆవిష్కృతమవుతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లోనూ ఈ సినిమాపై హైప్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లింది. ముఖ్యంగా యుఎస్ మార్కెట్లో ఈ సినిమా ప్రీమియర్స్‌కి జబర్దస్త్ రెస్పాన్స్ వచ్చింది.
లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం, యుఎస్‌లో ప్రీమియర్ షోలు ద్వారానే 550 వేల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. అంటే మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయో అందరికీ ఆసక్తిగా మారింది. వీకెండ్‌కు ఎలాంటి వసూళ్లు నమోదు అవుతాయోనన్న ఉత్సుకత ఇండస్ట్రీ వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు భారీ ఓపెనింగ్స్‌తో బ్లాక్‌బస్టర్ జాతర మొదలైందన్న అభిప్రాయం వినిపిస్తోంది. తాలూకు కలెక్షన్స్ చూస్తుంటే రికార్డుల పర్వం ఇదే అని చెప్పవచ్చు.
