పవన్ కళ్యాణ్ సినిమాలంటేనే అభిమానుల్లో ఓ స్పెషల్ ఫీవర్ ఉండటం ఇప్పుడేమీ కొత్త కాదు. ఇప్పుడు మళ్లీ ఆ ఫీవర్ తలెత్తుతోంది. ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత ఆయన నుంచి వచ్చిన స్ట్రైట్ సినిమా ‘హరిహర వీరమల్లు’ థియేటర్లలోకి వచ్చింది. పైగా ఇది ఒక పీరియాడికల్ డ్రామా కావడం, పవన్ కళ్యాణ్ స్టైల్ కి తగ్గట్టు మాస్ సన్నివేశాలతో ఉండడంతో సినిమా మీద హైప్ రోజురోజుకి పెరుగుతోంది.
ఇకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ సినిమాలకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రత్యేక ఆదరణ ఉండే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అయితే ఆయన్ని చూడాలనే ఉత్సాహం భయంకరంగా కనిపిస్తుంది. పవన్ గత సినిమాలన్నింటినీ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన ప్రముఖ థియేటర్లలో విశాఖపట్నంలోని జగదాంబ 70 ఎంఎం కూడా ఒకటి. ఇది నగరంలోనే కాదు, ఉత్తరాంధ్ర మొత్తం చూసినా టాప్ సింగిల్ స్క్రీన్ థియేటర్‌గా పేరు తెచ్చుకుంది.
ఇప్పుడు హరిహర వీరమల్లు రిలీజ్ సందర్భంగా ఈ జగదాంబ థియేటర్ వదిలింది కాదు. థియేటర్ సెంటర్ క్లాక్ టవర్ వద్ద పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేకంగా 75 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ఇది చూసిన అభిమానులు ఆనందంతో ఊగిపోతున్నారు. అక్కడి అట్మాస్ఫియర్ చూస్తేనే ఎంతగా ఈ సినిమాని అభిమానులు ఎదురుచూసారో అర్థమవుతుంది. ఈ థియేటర్ లో ‘హరిహర వీరమల్లు’ ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సిందే.
