ఎన్డీయే కూటమి పార్టీలు తమలో తాము కొట్టుకోకుండా.. సమైక్యంగా ఉండడం అనేది జగన్ దళాలకు మింగుడుపడని వ్యవహారాల్లో ఒకటి. వీరి ఐక్యతను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకపోవడం సహజం. కూటమి పార్టీల మధ్య ఇదే మైత్రీ సంబంధాలు కలకాలం కొనసాగినట్లయితే తాము ఎప్పటికీ ఈ రాష్ట్రంలో మరోసారి అధికారం కళ్ళ చూడలేమనే భయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఆ మైత్రిని విచ్ఛిన్నం చేయడానికి వారు ఎంచుకున్న మార్గం పవన్ కళ్యాణ్ ను రెచ్చగొట్టడం. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అద్భుతమైన సంయమనం ప్రదర్శిస్తూ కూటమి పార్టీల ఐక్యతకు తానే ఇరుసులాగా, ఇంధనం లాగా పని చేస్తున్నారు.
తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుకూల దళాలు … పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవిది ఇంకా దక్కకపోవడం గురించి ఆవేదన చెందుతున్నారు. నాగబాబుకు అన్యాయం జరిగిందని ఆయనకు మంత్రి పదవి ఇస్తారని ఆరు నెలల కిందట ప్రకటించి చంద్రబాబు నాయుడు ఇప్పటిదాకా దానిని అమలు చేయడం లేదని వారు రకరకాల నిందారోపణలు చేస్తున్నారు. తద్వారా జనసేన పార్టీ కార్యకర్తలలో కూడా అసంతృప్తిని పాదుగొల్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి కుట్రలు కొనసాగుతున్న తరుణంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో సమయంతో ఈ ప్రచారాలకు చెక్ పెట్టడం అనేది మనం గమనించాలి.
హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని రోజులుగా హైదరాబాదులోనే ఉంటూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వివిధ టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. అయితే ఒక ఛానల్ తమ ఇంటర్వ్యూలో నాగబాబుకు ఇంకా మంత్రి పదవి రాకపోవడం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా ఓర్పుగా సమాధానం చెప్పారు. నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. చంద్రబాబు వైపు నుంచి ఎలాంటి సందేహం లేదని తమ జనసేన పార్టీలోనే చర్చించి నిర్ణయం తీసుకోవడం అనేది ఇంకా పెండింగ్ లో ఉందని పవన్ చెబుతున్నారు. ఆలస్యం చంద్రబాబు వైపు నుంచి కాకపోగా ఆయన ద్రోహం చేసేస్తున్నట్టుగా ఛిత్రించి రంగు పులిమి పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కుట్రలకు చెక్ పడినట్లు అయింది.
ప్రస్తుతం నాగబాబు.. పవన్ కల్యాణ్ తరఫున పిఠాపురం నియోజవకర్గ వ్యవహారాలు అన్నింటినీ తానే సమన్వయం చేసుకుంటున్నారు. ఆయనకు మంత్రి పదవి విషయంలో ఎలాంటి సందేహం లేదని, సరైన శాఖ ఎంపిక చేసుకోవడం కోసం పవన్ కల్యాణే కాస్త ఆలస్యం చేస్తున్నారని అర్థమవుతోంది.
చిచ్చుపెట్టే వైసీపీ కుట్రలకు పవన్ చెక్!
Friday, December 5, 2025
