అటు హాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్ లోనూ భారీగా అలరించిన అవతార్ సిరీస్ నుంచి మూడో పార్ట్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే “అవతార్: ది ఫైర్ అండ్ ఆష్” అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించిన చిత్ర బృందం, తాజాగా సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. కొత్తగా విడుదలైన ఈ పోస్టర్‌లో టైటిల్‌కు తగ్గట్టుగా మంటలు, బూడిదతో కూడిన థీమ్ స్పష్టంగా కనిపించింది.
ఈ సినిమాను తెరకెక్కిస్తున్న లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ ఇప్పటివరకు చేసిన రెండు పార్ట్‌లను బట్టి చూస్తే, మూడో భాగంపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా పోస్టర్‌తో పాటు ట్రైలర్ అప్డేట్ కూడా బయటకు వచ్చింది. ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల కానున్న “ఫెంటాస్టిక్ 4” సినిమా ప్రదర్శనలో ఈ ట్రైలర్ స్క్రీన్ మీద వేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు చిత్ర యూనిట్ తెలిపింది.
సైన్స్ ఫిక్షన్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం, ఏడాది చివర్లో గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఇక అవతార్ సిరీస్‌లో మూడో భాగంగా వస్తున్న ఈ సినిమా కూడా విభిన్నమైన కాన్సెప్ట్, విజువల్స్‌తో మరోసారి ప్రేక్షకులను మాయ లోకంలోకి తీసుకెళ్లనుంది.
