టాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పిన సినిమా ‘హరిహర వీరమల్లు’ ఈ వారం థియేటర్లలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం కోసం ఆయన అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. గత కొంత కాలంగా రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్, ఈ సినిమాతో మళ్లీ మాస్ అపీలుతో స్క్రీన్‌మీద కనిపించనున్నాడు.
ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన క్రిష్‌కు జ్యోతి కృష్ణ కూడా సహాయ దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మించాడు. ఎప్పుడో ప్రారంభమై చాలా కాలం పాటు నిర్మాణంలో నిలిచిపోయిన ఈ ప్రాజెక్టు ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఇప్పుడు మేకర్స్ సినిమాను దేశవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇంతలో నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ విషయంలో క్లారిటీ వచ్చింది. ఈ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకున్నట్లు సమాచారం. ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం, ఈ రైట్స్ ధర సుమారు రూ.35 కోట్ల వరకు వెళ్లినట్లు చెబుతున్నారు. ఇది అధికారికంగా తెలియాల్సి ఉన్నప్పటికీ, ఫిల్మ్ సర్కిల్స్‌లో ఇదే టాక్ నడుస్తోంది.
మైత్రీ సంస్థ, ఈ సినిమాను నైజాంలో భారీగా రిలీజ్ చేయడానికి సర్వం సిద్ధం చేస్తోంది. థియేటర్ల సంఖ్య నుంచి ప్రమోషన్స్ వరకూ పెద్ద స్కేల్ ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా నైజాంలో పవన్‌కు ఉన్న ఫాలోయింగ్‌కి తోడు ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామా కావడం కూడా కలెక్షన్లపై ప్రభావం చూపనుంది.
నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా, బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఎం.ఎం.కీరవాణి సంగీతం ఈ సినిమాకు మరింత ఆకర్షణగా మారింది. జూలై 24న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇప్పుడు ఫాన్స్‌కే కాదు, ట్రేడ్ వర్గాలు కూడా సినిమా కలెక్షన్లపై ఆసక్తిగా చూస్తున్నాయి.
