హిందీలోకి కింగ్డమ్ పవర్‌ ఫుల్‌ టైటిల్‌ తో!

Tuesday, December 9, 2025

విజయ్ దేవరకొండ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ “కింగ్డమ్”కి సంబంధించిన ఓ కీలక అప్డేట్ బయటకు వచ్చింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. తాజాగా ఈ సినిమా హిందీ వెర్షన్‌పై వస్తున్న సందేహాలకు క్లారిటీ ఇచ్చారు మేకర్స్.

“కింగ్డమ్” హిందీకి డబ్బింగ్ కాదు… స్పెషల్‌గా డైరెక్ట్ హిందీలో రిలీజ్ చేయాలని నిర్ణయించారని నిర్మాతలు తెలిపారు. హిందీ వెర్షన్‌కు ‘సామ్రాజ్య’ అనే టైటిల్ ఖరారు చేశారు. దీనిని ప్రముఖ పంపిణీ సంస్థ అయిన AA ఫిల్మ్స్ రిలీజ్ చేస్తోంది. అంటే ఈ సినిమా ఇప్పుడు తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలో కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

విజయ్ దేవరకొండకు హిందీ మార్కెట్లో ఓ ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. అలాంటి బ్యాక్‌డ్రాప్‌లో “సామ్రాజ్య” అనే టైటిల్‌తో హిందీ ప్రేక్షకుల్ని టార్గెట్ చేయడం గమనార్హం. ఇక ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు అనిరుధ్, సినిమాను నిర్మిస్తున్న వారు సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్.

అక్టోబర్ 31న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. హిందీలో ‘సామ్రాజ్య’కి ఎలా స్పందన వస్తుందనేది ఆసక్తిగా మారింది. మొత్తానికి పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ ప్లాన్ చేసిన విధానం ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles