గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి సమయం కేటాయించడంలో మాత్రం ఎప్పుడూ ముందుంటాడు. ప్రస్తుతం ఆయన “పెద్ది” అనే భారీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి షూటింగులు కొనసాగుతుండగా, తాజాగా ఆయన కుటుంబంతో కలిసి ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు.
ఇటీవల చరణ్ భార్య ఉపాసన పుట్టినరోజు రావడంతో, ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మార్చేందుకు రామ్ చరణ్ ప్రత్యేకంగా ప్లాన్ చేశాడు. ఇంట్లో అందమైన డెకరేషన్ మధ్య ఉపాసన బర్త్‌డే జరిపి, ఒక మధురమైన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఆ ఫోటోలో ఉపాసన ఆనందంగా కనిపిస్తుండగా, చరణ్ కూడా స్మైల్ తో ఉన్నాడు. మరింతగా ఆకర్షించిన విషయం ఏంటంటే, వారి పాప క్లింకారా కూడా ఆ ఫోటోలో ఉండటంతో అభిమానుల హృదయాలు గెలుచుకుంది. ఈ అందమైన క్షణాన్ని చూసిన వాళ్లు “పిక్ ఆఫ్ ది డే” అన్నట్టు కామెంట్స్ చేస్తున్నారు.
ఇలా చరణ్ పనిలో బిజీగా ఉన్నా, కుటుంబ వేళ్లకు ప్రాధాన్యత ఇచ్చే తీరుతో మరోసారి ఫ్యామిలీ మ్యాన్ గా తనని చాటుకున్నాడు.
