‘లేని మద్యం స్కామ్‌’ను బాబు సృష్టించారట!

Friday, December 5, 2025

తీగలాగినప్పుడు అనేక డొంకలు కదిలాయి. ఏకంగా 41 మందిని నిందితులుగా చేర్చారు. 11 మందిని అరెస్టు చేశారు. వీరిలో పలువురిని అనేక పర్యాయాలు కస్టడీకి తీసుకుని మరీ విచారించారు. మొత్తానికి ఒక్క కుంభకోణం ద్వారా ఏకంగా మూడున్నర వేలకోట్ల రూపాయలు కాజేశారని తేల్చారు. ఎవరెవరి భాగస్వామ్యంతో దందా జరిగిందో తేల్చారు. ఎవరెవరి ఖాతాల్లో ఎప్పుడెప్పుడు? ఎంతెంత మొత్తాలు? ఏయే రూపాల్లో వెళ్లాయో కూడా ఆధారాలు సంపాదించారు. దాదాపుగా విచారణ పర్వాన్ని ప్రీ క్లయిమాక్స్ వరకు తీసుకువచ్చేసి.. ప్రిలిమినరీ చార్జిషీటు కూడా దాఖలు చేయబోతున్న ప్రస్తుత తరుణంలో వైసీపీ దళాలకు, సాక్షిమీడియా వారికి ఒక విచిత్రమైన ఐడియా వచ్చింది. ‘మద్యం కుంభకోణం పేరుతో అసలే ఏమీ లేని, ఎక్కడా జరగని స్కామ్ ను చంద్రబాబునాయుడే సృష్టించారు’ అని వారు తాజాగా కొత్త ప్రచారం ప్రారంభిస్తున్నారు. వారి కుట్రపూరితమైన ప్రచారాల్ని, ఆ ప్రచారాల వెనుక ఉన్న భయాన్ని చూసి జనం మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

నిజానికి ఇలాంటి మాట విచారణ తొలిదశలోనే వినపడింది. కానీ సాక్షి మీడియా దానిపై అంతగా ఫోకస్ పెట్టలేదు. గతంలో సాక్షిగా విచారణకు హాజరైన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. అసలు మద్యం స్కామ్ అనేదే లేదని.. లేని స్కామ్ గురించి వివరాలు చెప్పమంటే తానేం చెబుతానని సిట్ పోలీసులను ఎదురు ప్రశ్నించారు. ఈ పాయింట్ ను గోబెల్స్ లాగా పదేపదే ప్రచారం చేయడంలో సాక్షి ఫెయిలైంది. ఏదో జగన్ అడపాదడపా మద్యం స్కామ్ గురించి విలేకరుల సమావేశాల్లో సమాధానం చెప్పవలసి వచ్చినప్పుడు ఇలాంటి వాదనే వినిపించారు. కానీ.. తాజాగా ఈ పాయింట్ లేవనెత్తిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నిందితుడి హోదాలో విచారణకు హాజరు అవుతున్న సమయంలో.. సాక్షి ఆ ప్రచారాన్ని ముమ్రంగా తీసుకువెళ్లేందుకు సిద్ధం అవుతోంది. ‘అసలుకే లేని స్కామ్’ అనే దగ్గర వారు ఆగడం లేదు. లేని స్కామ్ ను చంద్రబాబునాయుడే సృష్టించి, అందులో తన రాజకీయ ప్రత్యర్థులు అందరినీ ఇరికిస్తున్నారంటూ వారు ఆడిపోసుకుంటున్నారు.

ఈ ప్రచారం చూసిన జనం మాత్రం తెగ నవ్వుకుంటున్నారు. కొత్త లిక్కర్ పాలసీ రూపొందిన తర్వాత.. మద్యం డిస్టిలరీలలో ఉద్యోగాలు పొందిన రాజ్ కెసిరెడ్డి నెట్వర్క్ మనుషులు నుంచి.. డిస్టిలరీలనుంచి నెలవారీగా రాబట్టిన వసూళ్ల  నుంచి .. పెడ్లర్లనుంచి.. బ్లాక్ మనీని నేరుగా బంగారం దుకాణాలకు తరలించి కొనుగోలు చేసిన బంగారం గురించి, రియల్ ఎస్టేట్ లో పెట్టిన పెట్టుబడుల గురించి, దుబాయికి తరలించిన హవాలా సొమ్ముల గురించి, రాజ్ కెసిరెడ్డి తీసిన సినిమాల గురించి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి తమ కష్టానికి తగ్గట్టుగా నెలవారీ అందుకున్న అయిదేసి కోట్ల రూపాయల ముడుపులనుంచి అనేక వివరాలను ఆధారాల సహా రాబట్టిన తర్వాత కూడా.. అసలు స్కామే జరగలేదని అంటూ.. ఎవరిని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారో తెలియడం లేదు. ఇంకా నయం.. ఇప్పుడు జగన్ ను, ఆయన అనుచరులను  ఇందులో ఇరికించడానికి అప్పట్లో చంద్రబాబునాయుడే తన మనుషులతో ఈ తప్పుడు పనులన్నీ చేయించి.. అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి.. ఆ నిందలను ఇప్పుడు జగన్ మీదికి మళ్లిస్తున్నాడని ఆరోపించడం లేదు.. అని జనం నవ్వుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles