టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఎప్పుడూ భారీ స్థాయిలో హైప్ ఉంటుంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న పాన్ ఇండియా లెవెల్ సినిమా ఓజిపై ఫ్యాన్స్‌లో విపరీతమైన ఆసక్తి ఉంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌ను యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తుండగా, ప్రాజెక్ట్ మొదటి రోజు నుంచే మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా విడుదల ఎప్పుడన్నదానిపై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వేర్వేరు వార్తలు వస్తున్నాయి. రిలీజ్ డేట్ మారుతుందంటూ అనేక రూమర్స్ చక్కర్లు కొట్టాయి. అయితే వాటికి నిర్మాత డీవీవీ దానయ్య స్వయంగా స్పందించి స్పష్టత ఇచ్చారు. ఆయన చెప్పిన ప్రకారం, ఓజి సెప్టెంబర్ 25న ఎటువంటి మార్పుల్లేకుండా థియేటర్లలోకి రాబోతోంది.
అదే రోజున బాలయ్య నటిస్తున్న అఖండ సీక్వెల్ కూడా ప్లాన్‌లో ఉండటంతో క్లాష్ తప్పదని భావించారు చాలా మంది. ఈ కారణంగా ఒక సినిమా వెనక్కి వెళ్లొచ్చని అంచనాలు వచ్చాయి. కానీ దానయ్య స్పష్టంగా తమ సినిమా షెడ్యూల్ మారదని చెప్పేశారు. అంటే పవన్ అభిమానులు ఆ డేట్‌కి గ్రాండ్ సెలబ్రేషన్‌కి రెడీ కావచ్చు.
ఈ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్‌లో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీతం థమన్ అందిస్తున్నాడు. పవన్ స్టైల్, సుజీత్ మేకింగ్ కలయికలో ఓజి ఎలా ఉండబోతోందో చూడాలి అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
