కమల్ హాసన్ నటించిన ఇండియన్ సినిమా ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఆడియెన్స్ లో ఓ సెన్సేషన్ లా మారింది. అలాంటి సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కించిన ఇండియన్ 2 పై మొదట్లో భారీ అంచనాలే ఉన్నా, చివరకు థియేటర్స్ లో మాత్రం వాటిని అందుకోలేకపోయింది.
అయితే ఇండియన్ 2 రిలీజ్ కాకముందే మేకర్స్ మూడో భాగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కానీ రెండో భాగం ఫలితానికి భిన్నంగా రావడంతో ఇండియన్ 3పై సందేహాలు మొదలయ్యాయి. సినిమా ఆగిపోయిందా, లేక డైరెక్ట్ ఓటిటిలోకి వస్తుందా అనే రూమర్లు మీడియాలో హల్ చల్ చేశాయి.
ఈ పరిస్థితుల్లో దర్శకుడు శంకర్ మాత్రం ఇండియన్ 3 ఇంకా ఉంది అని స్పష్టం చేశారు. తాజా సమాచారం ప్రకారం తమిళ చిత్ర వర్గాలలో నుండి ఇండియన్ 3 పక్కా వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా ఓ పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేయాల్సి ఉండటంతో త్వరలోనే పనులు మళ్లీ స్టార్ట్ అవుతాయని టాక్ వినిపిస్తోంది.
ఇప్పుడు ఈ లీకులన్నింటిలో ఎంత నిజం ఉంది అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కానీ మూడో భాగం వస్తే మాత్రం శంకర్ – కమల్ కాంబినేషన్ ఇంకోసారి ప్రేక్షకుల్ని అబ్బురపర్చే అవకాశం ఉంది.
