ఇప్పుడే ఇండియన్ సినిమాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మల్టీస్టారర్ ప్రాజెక్ట్ WAR 2. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి స్క్రీన్ షేర్ చేయడం విశేషం. ఈ యాక్షన్ డ్రామా మరో నెల రోజుల్లో థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో విడుదల చేసిన లేటెస్ట్ పోస్టర్ సినిమాపై హైప్ ను మరింత పెంచేసింది.
ఈ పోస్టర్ లో ముగ్గురు ప్రధాన పాత్రలు కనిపిస్తున్న తీరూ విపరీతంగా ఆకట్టుకుంటోంది. హృతిక్ స్టైలిష్ లుక్ లో ఉంటే, ఎన్టీఆర్ రఫ్ అండ్ రగ్డ్ గెటప్ లో చాలా పవర్‌ఫుల్ గా ఉన్నాడు. మరోవైపు కియారా అద్వానీ కూడా యాక్షన్ మోడ్ లో ఉండటం ఈ సినిమాలో ఆమె పాత్రకీ ప్రాధాన్యత ఉందని చూపిస్తోంది.
ఇంకా ఆసక్తికరంగా ఉన్న విషయం ఏంటంటే.. పోస్టర్ డిజైన్ లో రెండు బోట్ల మధ్య హీరోలు ఒకరికొకరు గన్స్ తో ఎదుర్కొనేలా చూపించడం. బ్యాక్‌డ్రాప్ లో యాక్షన్ సీన్స్ ను మిక్స్ చేసి అందంగా కాంబినేషన్ సెట్ చేయడమూ ప్రత్యేకంగా నిలిచింది.
మొత్తానికి ఈ స్పెషల్ పోస్టర్ విడుదలవడంతో సినిమా మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఎన్టీఆర్, హృతిక్ ల కలయికతో సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి ఇప్పటికే ప్రేక్షకుల్లో పీక్స్ లో ఉంది. ఇక WAR 2 రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ ఒకొక్కటిగా వేగం పెంచుతున్నాయి.
