లెనిన్‌ గురించి తాజా సమాచారం ఏంటంటే!

Friday, December 5, 2025

అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన కెరీర్‌లో కొత్త దశకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. గతంలో వచ్చిన ఏజెంట్ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో కొంత విరామం తీసుకున్న అఖిల్, ఇప్పుడు మళ్లీ ఫుల్ ఫోకస్‌తో “లెనిన్” అనే భారీ సినిమాతో బిజీ అయ్యాడు. కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ఫ్యాన్స్‌ లోనే కాదు, ఇండస్ట్రీలో కూడా మంచి ఆసక్తి నెలకొంది.

ప్రారంభంలో ఈ చిత్రంలో కథానాయికగా శ్రీలీలను ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, ఆమె ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో శ్రీలీల స్థానంలో మరో యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సేను తీసుకున్నారని ఇండస్ట్రీ టాక్. జూలై 16 నుంచి ఆమె షూటింగ్‌లో జాయిన్ కాబోతుందన్న వార్తలతో ఇది పక్కా అయ్యేలా కనిపిస్తోంది.

ఇక ఈ మాస్ ఎంటర్టైనర్‌కి మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్ పని చేస్తున్నాడు. సంగీతం పరంగా ఈ సినిమా మీద మంచి అంచనాలున్నాయి. ఇక నిర్మాణ బాధ్యతలు సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకార స్టూడియోస్ కలిసి చూసుకుంటుండటంతో కంటెంట్‌తో పాటు ప్రొడక్షన్ వాల్యూస్‌లోనూ ఈ సినిమా స్ట్రాంగ్‌గా ఉండబోతోందని అంచనాలు నెలకొన్నాయి.

అఖిల్‌కు కమర్షియల్ హిట్ అవసరమైన ఈ టైమింగ్‌లో “లెనిన్” సినిమాతో ఎలాంటి మెరుపు చూపిస్తాడో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles