రోబో తరువాత నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అదే!

Friday, December 5, 2025

ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన దిగ్గజ దర్శకుల్లో ఒకరిగా ఎస్ ఎస్ రాజమౌళి ఇప్పుడు టాప్ ప్లేస్‌లో ఉన్నారు. ఆయన సినిమా ఒక్కటి వస్తుందంటేనే దేశం మొత్తం చూస్తుంది. అలాంటి రాజమౌళి కూడా ఒకసారి ఓ ఇంటర్వ్యూలో తనకి స్ఫూర్తిగా నిలిచిన డైరెక్టర్ ఎవరు అనగా శంకర్ అని చెప్పడం విశేషం. ఇండియన్ సినిమాకే టెక్నికల్ మార్గదర్శకుడిగా నిలిచిన శంకర్, గతంలో చేసిన సినిమాలతో స్టాండర్డ్స్ ని కొత్తగా నిర్వచించారు.

శంకర్ అందించిన “రోబో” లాంటి సినిమాలు అప్పట్లో హద్దుల్ని దాటేసినవే. భారీ విజువల్స్, అద్భుతమైన కథనం, అప్పటి కాలానికి బహుశా ఊహించని టెక్నాలజీతో ప్రేక్షకులను విస్మయానికి గురిచేశారు. అయితే ప్రస్తుతం శంకర్ చేస్తున్న సినిమాలపై కొంత విమర్శ వస్తోంది. ఒకప్పుడు అతని సినిమాల కోసం ఎదురు చూసే ఫాన్స్ ఇప్పుడు కొంచెం డౌట్‌లో పడిపోయారు.

ఇటీవల శంకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రోబో తనకు కలల ప్రాజెక్ట్ అయితే, ఇప్పుడు ‘వేళ్పారి’ అనే చిత్రం తన కొత్త డ్రీమ్ అని ఆయన చెప్పారు. ఈ సినిమా తలపెట్టిన విధానం, టెక్నాలజీ వినియోగం చూస్తే ఇది అవతార్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ వంటి హాలీవుడ్ చిత్రాలకు సమంగా ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, స్టోరీ స్కోప్ లో ఇది ఓ నూతన మైలురాయి అవుతుందని భావిస్తున్నారు.

కానీ మరోవైపు నెగటివ్ కామెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. శంకర్ మళ్ళీ చాలా ఖర్చు చేస్తాడంటూ, ఫలితం ఎలా ఉంటుందో అని కొంత మంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక 24 గంటల ఫుటేజ్ తీస్తాడని, అవసరానికి మించి సినిమాని భారీగా చేస్తాడంటూ విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

ఏమైతేనేం, శంకర్ తన సత్తా మళ్లీ చూపించగలడా? “వేళ్పారి” సినిమాతో మరోసారి ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచానికి చూపించగలడా అనేది ఆసక్తిగా మారింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles