ఓటీటీలోకి జెర్సీ ముద్దుగుమ్మ స్పై థ్రిల్లర్‌!

Friday, December 5, 2025

తెలుగు ప్రేక్షకులకు థ్రిల్లర్ సినిమాలంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా సౌత్ ఇండియన్ సినిమాలు ఈ మధ్యకాలంలో విభిన్న కథలతో రిపీట్ వాచ్ అయ్యేలా ఆకట్టుకుంటున్నాయి. గతేడాది ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఎంతగా సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ తరహాలోనే మరో కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా ‘కలియుగం 2064’.

ఈ చిత్రంలో ‘జెర్సీ’ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ ముఖ్య పాత్రలో కనిపించగా, ప్రమోద్ సుందర్ దర్శకుడిగా వ్యవహరించారు. భవిష్యత్తులో మన సమాజం ఎలా మారుతుందో, టెక్నాలజీ మన జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తుందో అనే అంశాలపై ఈ కథ సాగుతుంది. మానవ భావోద్వేగాలు, విలువలు ఎలా తగ్గిపోతున్నాయనే సూటిగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు.

ఇప్పటికే మే నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటిటీలో అందుబాటులోకి వచ్చింది. తమిళ ప్రేక్షకులకు సన్ నెక్స్ట్ యాప్‌లో లభిస్తుండగా, తెలుగు ప్రేక్షకుల కోసం ఆహా వేదికగా నిలిచింది.

డాన్ విన్సెంట్ సంగీతం ఈ సినిమాకు కీలకంగా నిలిచింది. కే ఎస్ రామకృష్ణ, కే రామ్ చరణ్ కలిసి నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ఓ వైవిధ్యభరితమైన సైన్స్ ఫిక్షన్ ఎక్స్‌పీరియెన్స్ ను అందిస్తుంది. భిన్నమైన కథలు ఇష్టపడే ప్రేక్షకులు ‘కలియుగం 2064’ సినిమాను ఓసారి ఆహాలో చూసేందుకు ప్రయత్నించవచ్చు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles