మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సోషియో ఫాంటసీ సినిమా విశ్వంభరపై అభిమానుల్లో బజ్ రోజురోజుకు పెరుగుతోంది. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ఎన్నో కారణాల వల్ల వాయిదాలు పడుతూ వస్తున్నా, ప్రతి చిన్న అప్‌డేట్‌కి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కీలక సమాచారమొకటి బయటకి వచ్చింది. ఇటీవల చిరంజీవి స్వయంగా ఈ సినిమాలోని గ్రాఫిక్స్ వర్క్‌ను చూశారని తెలుస్తోంది. దాదాపు 45 నిమిషాలపాటు వీఎఫ్ఎక్స్ అవుట్‌పుట్‌ను ఆయన పరిశీలించినట్టు సమాచారం. ప్రస్తుత గ్రాఫిక్స్ క్వాలిటీ పట్ల చిరంజీవి సంతృప్తిగా ఉన్నారని తెలిసింది. అదే సమయంలో ఇప్పటికీ మిగిలి ఉన్న కొన్ని ప్యాచ్ వర్క్ సీన్లు, పాటల చిత్రీకరణను త్వరగా పూర్తిచేయాలని చిత్ర బృందాన్ని ఆయన కోరినట్టు టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎం.ఎం. కీరవాణి పనిచేస్తున్నారు. ఇక ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఎప్పటికప్పుడు వచ్చే అప్‌డేట్స్ సినిమా మీద అంచనాలు మరింత పెంచుతున్నాయి.
