ఇప్పుడు బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ “రామాయణ” మీద ఫిలిం సర్కిల్స్ లో బజ్ రోజురోజుకీ పెరుగుతోంది. హాలీవుడ్ స్థాయిలో అత్యాధునిక సాంకేతికతతో రూపొందుతున్న ఈ సినిమా రీసెంట్‌గా విడుదలైన టైటిల్ గ్లింప్స్‌తో మరింత హైప్ క్రియేట్ చేసింది.
ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపించబోతుండగా, సీతగా సాయి పల్లవి ఎంపిక కావడం సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది. మరోవైపు యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారని సమాచారం. ప్రతి పాత్రకూ వెయిట్ ఉన్నట్లే కాక, వీరి లుక్స్ ఎలా ఉంటాయో అనే క్యూరియాసిటీ కూడా ప్రేక్షకుల్లో భారీగా ఉంది.
ఇప్పుడు తాజా వార్తల ప్రకారం, లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం అవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన స్క్రీన్ మీద కాకుండా, తన గొంతు వినిపించనున్నారని తెలుస్తోంది. జటాయు పాత్రకు అమితాబ్ వాయిస్ ఓవర్ అందించనున్నారని టాక్. ఇది నిజమైతే, ఆయన వాయిస్‌తో ఆ సీన్‌కు ఇంకొక లెవెల్ వెయిట్ వచ్చేస్తుంది.
ఇక ఈ సినిమాకు సంగీతం విషయంలో కూడా భారీగా ప్లానింగ్ చేస్తున్న చిత్రబృందం.. అంతర్జాతీయ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్, మన మ్యూజిక్ మాస్ట్రో ఏ ఆర్ రెహమాన్ లను కలిసి ఈ ప్రాజెక్ట్‌కు బాణీలను అందించేందుకు తీసుకొచ్చారు. ఇది రామాయణ సినిమాకు ఒక ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.
నమిత్ మల్హోత్రా ఈ మోస్ట్ అవైటెడ్ సినిమాను అత్యంత ఖర్చుతో నిర్మిస్తున్నారు. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ హాలీవుడ్ స్టాండర్డ్స్‌లో ఉండబోతున్నాయని టాక్. ఈ సినిమా ఒక్క బాలీవుడ్ కే కాదు, మొత్తం దేశం మరిచిపోలేని స్థాయిలో ఉండబోతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ షూటింగ్ దశలో ఉండగా, త్వరలో మరిన్ని అప్‌డేట్స్ రావచ్చునని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
