మరోసారి రికార్డు సృష్టించిన తండేల్‌!

Friday, December 5, 2025

ఈ సంవత్సరం విడుదలైన తెలుగు హిట్ చిత్రాల్లో ఓ మంచి గుర్తింపు సంపాదించుకున్న సినిమా తండేల్. నాగ చైతన్య మరియు సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాను చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కించారు. సినిమా రిలీజ్ అయ్యిన తర్వాత థియేటర్స్ లోనూ, ఓటిటీల్లోనూ చాలా మంచి రెస్పాన్స్ అందుకుంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో తండేల్ ఒక క్లీన్ హిట్ గా నిలిచింది.

తాజాగా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ విషయంలోనూ అలానే సక్సెస్ అందుకుంది. జీ తెలుగు ఛానెల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రదర్శితమైన తండేల్, మొదటి టెలికాస్ట్ లోనే 10.32 టీఆర్పీ రేటింగ్ సాధించింది. ఇది ఈ ఏడాదిలో జీ తెలుగులో వచ్చిన సినిమాల్లో టాప్ రేటింగ్స్ లో ఒకటిగా నిలవడం విశేషం. సంక్రాంతి తర్వాత మరోసారి ఈ స్థాయిలో టీఆర్పీ రేటింగ్ అందుకోవడం జీ టీవీకి కూడా మంచి బూస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు.

ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించారు. కథలోని ఎమోషన్, మ్యూజిక్, హీరో-హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అన్నీ కలిసి సినిమాకు విభిన్నతను తీసుకొచ్చాయి. దీంతో ఈ చిత్రం ఎక్కడ ప్రదర్శించబడినా మంచి స్పందననే రాబడుతోంది.

తండేల్ థియేటర్లో హిట్ అయింది అనడమే కాదు, ఓటిటీ నుంచి బుల్లితెర దాకా అన్ని వేదికలపై మంచి ఫలితాలే సాధించడం స్పెషల్ గా మారింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles