బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పేరు మన తెలుగు ప్రేక్షకులకు ఆర్ఆర్ఆర్ సినిమాతో బాగా చేరువైంది. ఇక ఆమె తాజా చిత్రం “జిగ్రా”తో కూడా మళ్లీ మరోసారి హైప్ క్రియేట్ అవుతోంది. అయితే ఇపుడు ఆమె గురించి వెలుగులోకి వచ్చిన ఓ షాకింగ్ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. గతంలో ఆలియా పర్సనల్ అసిస్టెంట్‌గా పని చేసిన వేదిక ప్రకాష్ శెట్టి అనే మహిళ, ఆమె నమ్మకాన్ని వాడుకుని పెద్ద ఎత్తున మోసానికి పాల్పడినట్టు తెలుస్తోంది. మొదట పర్సనల్ అసిస్టెంట్ గా మాత్రమే పని చేసిన ఈమె.. ఆలియా నడుపుతున్న ప్రొడక్షన్ హౌస్ లో కూడా చోటు సంపాదించింది. అలా ఆఫీస్ విషయాల్లోకి కూడా ఎంటరైన తర్వాత ఫేక్ బిల్లులు తయారుచేసి.. వాటిపై నకిలీ సంతకాలు పెట్టడం మొదలు పెట్టిందట.
ఈ క్రమంలో దాదాపు 77 లక్షల రూపాయల వరకు మోసం చేసినట్టు వివరాలు చెబుతున్నాయి. ఆలియా టీమ్ కి ఈ విషయం ఆలస్యంగా తెలిసినప్పటికీ, వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. తద్వారా ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇప్పుడు విచారణ కొనసాగిస్తున్నారని సమాచారం. ఈ దర్యాప్తులో ఇంకా ఇతర కీలక విషయాలు బయటపడే అవకాశముందని చెబుతున్నారు.
ఇక ఈ వ్యవహారాన్ని పక్కన పెడితే.. ఆలియా భట్ ప్రస్తుతం ‘ఆల్ఫా’ అనే ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేస్తోంది. ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం.
