వీరమల్లు నుంచి నెక్స్ట్‌ ట్రీట్‌ ఎప్పుడంటే..

Friday, December 5, 2025

తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడిన సినిమాల్లో ప్రస్తుతం ముందున్నది హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాబీ డియోల్ కీలక నెగటివ్ రోల్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాను జ్యోతి కృష్ణ, క్రిష్ కలిసి డైరెక్ట్ చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది. ఆ తర్వాత ఇంకొన్ని ప్రోమోషనల్ కంటెంట్ రిలీజ్ అవుతాయని అంచనాలు ఉన్నప్పటికీ, తాజాగా మేకర్స్ ఒక ప్రత్యేకమైన అప్డేట్ ప్లాన్ చేసినట్టు సినీ వర్గాల్లో మాటలు వినిపిస్తున్నాయి. సినిమా మ్యూజిక్‌ విషయానికి వస్తే కీరవాణి కంపోజ్ చేసిన ఆల్బమ్‌లో మొత్తం ఆరు పాటలు ఉండబోతున్నాయని సమాచారం. ఇందులో నాలుగు ఇప్పటికే వచ్చేశాయి. ఇప్పుడు ఐదవ పాట విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఇండస్ట్రీ టాక్.

అయితే ఈ ఐదవ పాటపై ఇంకా అధికారికంగా ఏమైనా తెలియాల్సి ఉంది. ఇక నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ఏ ఎం రత్నం, ఈ సినిమాను జూలై 24న భారీ స్థాయిలో పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రైలర్ నుండి మొదలుకొని పాటల వరకు మంచి స్పందన వస్తుండటంతో, ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles