వారితో కలిసి కన్నప్ప చూసిన మోహన్‌ బాబు!

Wednesday, December 10, 2025

విష్ణు మంచు తన కలల ప్రాజెక్ట్‌గా తీసుకున్న “కన్నప్ప” సినిమా మంచి స్పందనతో ముందుకెళ్తోంది. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు కూడా విజయవంతంగా రన్ అవుతోంది. భక్తిరసంతో నిండిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది. ప్రేక్షకుల ఆదరణతో కలసి డివోషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

తాజాగా విజయవాడలో ఈ సినిమాకు ఓ ప్రత్యేక ప్రదర్శన జరిగింది. ఈ ప్రత్యేక షోను గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో నిర్వహించారు. “సేవ్ టెంపుల్స్ భారత్” సంస్థ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం విశేషం. ఈ స్పెషల్ స్క్రీనింగ్‌కు సినీ వేతరులకు చెందిన నాగ సాధువులు, అఘోరాలు, యోగినీలు హాజరయ్యారు. మరింత విశేషం ఏమిటంటే.. ప్రముఖ నటుడు, నిర్మాత డా. మోహన్ బాబుతో పాటు ఎంతో మంది ఆధ్యాత్మికులు కూడా ఈ సినిమాను ఆసక్తిగా చూశారు.

ఈ సందర్భంగా మోహన్ బాబు తన అనుభవాన్ని వ్యక్తం చేస్తూ “కన్నప్ప”పై దేశవ్యాప్తంగా వస్తున్న ప్రశంసలు గర్వంగా ఉన్నాయన్నారు. విష్ణు మనసు పెట్టి నటించారని, ఆయన పాత్రలో చూపించిన నమ్మకం అందరికీ నచ్చిందన్నారు. విజయవాడలో సాధువుల సమక్షంలో ఈ చిత్రాన్ని మళ్లీ చూసినందుకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన చెప్పారు.

అదే సమయంలో గజల్ శ్రీనివాస్ ఈ సినిమాపై ప్రత్యేకంగా మాట్లాడారు. “కన్నప్ప” కథను ఈ తరం ప్రేక్షకులకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ సినిమా వచ్చినట్టు చెబుతూ.. ప్రతి సన్నివేశం ప్రేక్షకుడిలో భక్తి భావనను నింపుతుందన్నారు. భక్తి, వీరత్వం మిళితమైన ఈ చిత్రానికి ప్రతిస్పందన అద్భుతంగా ఉందన్నారు.

ఈ సినిమాలో విష్ణుతో పాటు అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్‌లాల్, శరత్ కుమార్ లాంటి నటులు కనిపించడం ప్రేక్షకులకు ఆకర్షణగా మారింది. ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సాధువులు, మాతాజీలు సినిమా చూసి ఆనందించడమే కాకుండా, చిత్రాన్ని శుభపరిచారంగా అభివర్ణించడం విశేషంగా మారింది.

ఇలా ఓ పౌరాణిక కథను ఈ కాలానికి సరిపోయేలా తీసిన విష్ణు మంచు ప్రయత్నం ప్రతి దశలోనూ ఫలిస్తున్నట్లు కనిపిస్తోంది. “కన్నప్ప” సినిమాపై ఇప్పటికీ మంచి పాజిటివ్ టాక్ కొనసాగుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles