నిజం చెప్పాలంటే చిత్తూరు జిల్లా పోలీసులు జగన్ మోహన్ రెడ్డి యాత్ర పట్ల చాలా ఉదారంగా స్పందించారనే చెప్పాలి. ఆయనకు ఆల్రెడీ హెలిప్యాడ్ కు సంబంధించిన అనుమతులు ఇచ్చారు. చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ తాజాగా జగన్ పర్యటనకు సంబంధించి ఇచ్చిన అనుమతులు, విధించిన షరతులను వివరించారు. తోతాపురి మామిడికి సరైన ధర పలకడం లేదనే పరిస్థితుల్లో మామిడి రైతుల్ని పరామర్శించడానికి.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారు పాళ్యానికి బుధవారం రానున్నారు. ఎస్పీ చెబుతున్న ప్రకారం.. హెలిప్యాడ్ వద్దకు 30 మంది మాత్రమే రావాలని, మొత్తం కార్యక్మరంలో 500 మందికి మించి పాల్పడడానికి వీల్లేదని ఆదేశించారు.
నిజానికి చిత్తూరులో పోలీసు ఎస్పీ చాలా ఉదారంగా వ్యవహరించినట్టు లెక్క. ఎందుకంటే.. రెంటపాళ్ల పర్యటన సందర్భంగా వందమందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే అక్కడ కేవలం మరణించిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తగా, ఇక్కడ రైతుల్ని పరామర్శించడానికి వెళ్తున్నందున 500 మంది వరకు అనుమతించడం బాగానే ఉంది.
అయితే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన అనుచర నీలిదళాలు మాత్రం.. బుధవారం కార్యక్రమంలో చెలరేగిపోవాలని ఆల్రెడీ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే చాలా పెద్దసంఖ్యలో జనాన్ని బంగారుపాళ్యం కార్యక్రమానికి పోగేయాలని చిత్తూరు జిల్లా నాయకులకు పురమాయించినట్లుగా సమాచారం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరుండి ఇక్కడి ఏర్పాట్లను చూసుకుంటున్నారు. గతంలో తిరుపతి ఎంపీ పదవికి ఉప ఎన్నిక జరిగినా కూడా.. పుంగనూరు, పీలేరు ప్రాంతాలనుంచి జనాన్ని లారీల్లో తరలించి దొంగఓట్లు వేయించారనే ఆరోపణలు ఎదుర్కొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూనుకుంటే.. మాజీసీఎం కార్యక్రమానికి జనాన్ని తోలించడం పెద్ద విషయమేమీ కాదు.
ఎస్పీ మణికంఠ చాలా స్పష్టంగా నిబంధనలు చెబుతున్నారు. హెలిప్యాడ్ చుట్టూ రెండు లేయర్లుగా బారికేడ్లు ఏర్పాటు చేసుకోవాలని, 30 మందికి మించకుండా అక్కడకు నాయకులు రావాలని, జనాన్ని నియంత్రించుకోవాలని అంటున్నారు. అదే తరహాలో.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటుచేసుకోవాలని పార్టీ వారికి సూచిస్తున్నారు. కానీ అహంకారంతో కళ్లు మూసుకుపోయిన వైసీపీ నాయకులు ఇలాంటి సూచనలు పట్టించుకుంటారా? అనేది ప్రశ్న! తన పర్యటనల్లో తొక్కిసలాటలు జరగడం, నిబంధనలు అతిక్రమించడం, ఆంక్షలు ధిక్కరించడమే జగన్ కు కావాల్సింది. అలా జరిగితే.. ‘నా ప్రాణాలకు రక్షణలేదు మొర్రో.. నన్ను చంపేయాలనుకుంటున్నారు మొర్రో ’ అని జనం వద్ద ఏడవచ్చుననేది ఆయన ప్లాన్. అందుకోసమే అతిగా జనాన్ని తరలించడానికి స్థానిక నాయకుల్ని పార్టీ అధినేతలు హింస పెడుతున్నట్టుగా తెలుస్తోంది.
ఉల్లంఘనలు, ధిక్కరణలతో రచ్చకు జగన్ దళాలు రెడీ!
Friday, December 5, 2025
