ఖాకీ డైరెక్టర్‌ తో ధనుష్‌ నెక్స్ట్‌ మూవీ!

Friday, December 5, 2025

తెలుగు, తమిళ్, హిందీ సినిమాలతో రెగ్యులర్‌గా బిజీగా ఉండే హీరోల్లో ధనుష్ పేరు ముందు వస్తుంది. ఏ భాషలో అయినా నటనతో ఆకట్టుకునే ఈ వర్సటైల్ యాక్టర్ ప్రస్తుతం మూడు ఇండస్ట్రీలలోనూ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. తాజాగా తెలుగులో విడుదలైన కుబేర సినిమాతో మంచి హిట్ అందుకున్న ధనుష్, ప్రేక్షకుల నుండి మంచి స్పందనతో పాటు మంచి కలెక్షన్లను కూడా సాధించాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తర్వాత, ఆయన ప్రాజెక్టుల జాబితాలో మళ్లీ కొత్తగా మరో దర్శకుడు చేరారు.

ఈసారి ధనుష్ కలిసి పనిచేయబోయే దర్శకుడు ఏవరో కాదు, ఖాకీ, వలిమై, తెగింపు లాంటి సినిమాలతో ఆకట్టుకున్న హెచ్ వినోద్. ప్రస్తుతం దళపతి విజయ్‌తో జన నాయకుడు అనే భారీ సినిమా తెరకెక్కిస్తున్న ఆయన, ధనుష్‌కు ఓ కొత్త కథ వినిపించగా వెంటనే హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. వీరి కాంబోలో రాబోయే ఈ కొత్త చిత్రానికి ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫిక్స్ అయిపోయాడు. మ్యూజిక్ కోసం సామ్ సి ఎస్‌ను తీసుకున్నారు.

ఇక ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం, హెచ్ వినోద్ – ధనుష్ కాంబోలో రూపొందే ఈ సినిమా, జన నాయకుడు చిత్ర పనులు పూర్తి అయిన తర్వాతనే సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. దీంతో అభిమానుల్లో ఈ ప్రాజెక్ట్ పై మంచి క్రేజ్ మొదలవుతోంది. ఇక కథ ఎలా ఉంటుందా..? ఫస్ట్ లుక్ ఎప్పుడొస్తుందా..? అనే ఉత్కంఠ మొదలైనట్లు ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles