సీతా పయనానికి ముహుర్తం కుదిరింది!

Friday, December 5, 2025

యాక్షన్ సినిమాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అర్జున్ సర్జా ఇప్పుడు ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు మెగాఫోన్ పట్టారు. ఆయన డైరెక్ట్ చేస్తున్న తాజా సినిమా పేరు ‘సీతా పయనం’. ఈ చిత్ర టీజర్‌ను కొద్దిరోజుల క్రితమే విడుదల చేయగా, అందులోని విజువల్స్, ఎమోషనల్ టచ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి.

ఈ సినిమాలో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా నటిస్తూ టాలీవుడ్‌కు పరిచయమవుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ మెటీరియల్ ద్వారా ఆమెపై ఆసక్తి పెరిగింది. అదే సమయంలో ఈ సినిమా మంచి క్రేజ్ దక్కించుకుంటోంది.

ఇప్పుడీ క్రేజ్‌ను మరో స్టెప్ ముందుకు తీసుకెళ్లేందుకు మేకర్స్ సాంగ్ ప్రమోషన్‌ను స్టార్ట్ చేస్తున్నారు. జూలై 10న విడుదల చేయనున్న ఈ మూవీ ఫస్ట్ సింగిల్ పేరు ‘ఏ ఊరికెళ్తావే పిల్లా’. ఈ పాటతో ప్రేక్షకుల్లో సినిమాపై మరింత హైప్ పెరగడం ఖాయం అంటున్నారు యూనిట్ సభ్యులు.

ఇక ఈ కథలో హీరోగా నిరంజన్ కనిపించనున్నాడు. అర్జున్ సర్జా సహా ప్రకాష్ రాజ్, సత్య రాజ్, బిత్తిరి సత్తి, కోవై సరళ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్ పని చేస్తున్న ఈ సినిమాకు రొమాన్స్, ఎమోషన్, ఎంటర్టైన్‌మెంట్ అన్నీ ఉండబోతున్నాయనే టాక్ వినిపిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles