పాపం రీకాలింగ్ ఆర్కే రోజాకే సబ్జెక్టు లేదు!

Friday, December 5, 2025

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా ఆర్భాటంగా రీకాలింగ్ మ్యానిఫెస్టో అనే దుర్మార్గపు కార్యక్రమాన్ని ప్రారంభించింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మేనిఫెస్టో హామీ లను అమలు చేయడం లేదని నిందలు వేయడం ఒక్కటే లక్ష్యంగా ఈ కార్యక్రమంలో ముందుకు సాగుతున్నారు. అయితే పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలకు కీలక నాయకులు అందరికీ ఖచ్చితంగా ప్రజలలోకి వెళ్లే కార్యక్రమాలు నిర్వహించాలని తాడేపల్లి నుంచి ఆదేశాలు వెళుతున్నాయి. వారికేమో ప్రజల్లోకి వెళ్లడానికి మొహం చెల్లడం లేదు. ఎక్కడకు వెళ్ళినా ప్రజలు తమనే నిలదీస్తున్నారని వారు భయపడుతున్నారు. విషయం ఏంటంటే కూట మి ప్రభుత్వం ఏర్పడి కేవలం ఒక ఏడాది మాత్రమే అయిన నేపథ్యంలో.. మేనిఫెస్టో ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడడానికి వైసీపీ నాయకులకు సబ్జెక్టు దొరకడం లేదు. మినీ బన్నీ చేసి మాట్లాడే మహా నాయకురాలు మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా మేనిఫెస్టో సంగతి వదిలేసి ఇతర విషయాలు మాట్లాడుతున్నారు.

విధిలేక పార్టీ పురమాయింపు మేరకు నగరిలో కార్యక్రమం నిర్వహించిన ఆర్కే రోజా.. మేనిఫెస్టోలో ఏమేమి విఫలమయ్యారు చెప్పడం మానేసి పసలేని సోది ఆరోపణలన్నీ చేసి ముగించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత ఉండడం లేదని, తోతాపూరి మామిడి రైతుల గురించి చంద్రబాబు పట్టించుకోవడంలేదని అడ్డగోలుగా ఏదేదో మాట్లాడారు. ఆ మాటలు చూస్తే చాలు.. రోజా దగ్గర సబ్జెక్టు లేదని అర్థమవుతుంది.
నిజానికి ఇది ఒక్క రోజా యొక్క కష్టం మాత్రమే కాదు. ఆ పార్టీలో అందరు నాయకులు ఇదేమాదిరి కష్టాలు పడుతున్నారు. కార్యక్రమం పెట్టకపోతే పార్టీలో పైనుంచి ఆదేశాలు. పెడితే ఏం మాట్లాడాలో తెలియదు. పార్టీలో  పైనుంచి ఆదేశాలు వెంటాడుతుంటాయి. పెడితే.. ప్రజలు పట్టించుకోవడం లేదు. రీకాలింగ్ మేనిఫెస్టో అనే కార్యక్రమం పెట్టి.. ఏదేదో సోది మాట్లాడాల్సి వస్తోంది. ప్రభుత్వం మీద ఇతర రకరకాల నిందలు వేయాల్సి వస్తోందని అనుకుంటున్నారు.

మేనిఫెస్టో రీకాలింగ్ అంటూ 2019 నాటి మేనిఫెస్టో సంగతులు మాట్లాడాలని జగన్ కోరిక. కానీ అది ప్రజల దగ్గర వర్కువట్ కావడం లేదు. ఇప్పటి మేనిఫెస్టో లో అనేక కీలక హామీలు ఇప్పటికే అమలయ్యాయి. మరిన్ని అమలు కావడానికి సిద్ధంగా ఉన్నాయి. చంద్రబాబు షెడ్యూలు కూడా ప్రకటించి.. గడువుతేదీల ప్రకారం ముందుకు వెళుతున్నారు. దాంతో వైసీపీ నేతలు ఖంగు తింటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles