యూఎస్‌ లో దూసుకుపోతున్న కుబేర..!

Friday, December 5, 2025

ధనుష్ ప్రధాన పాత్రలో, మన టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన “కుబేర” సినిమా ఇప్పుడు ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది. నాగార్జున ఓ బలమైన పాత్రలో కనిపించడం, రష్మిక మందన్నా అద్భుతంగా నటించడం, ఈ సినిమాని మరింత ప్రత్యేకంగా మార్చేశాయి. ఎమోషన్స్ మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మిక్స్ చేసిన ఈ కథ, ధనుష్ సినీ ప్రయాణంలో ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది.

ఇప్పటికే రెండు వారాలు పూర్తయ్యినా, థియేటర్లలో ఈ సినిమా వసూళ్లు తగ్గేలా కనిపించడం లేదు. మూడవ వారం లోకి వెళ్లిన తర్వాత కూడా సినిమాకి టికెట్ కౌంటర్ల దగ్గర మంచి బుకింగ్స్ నమోదవుతున్నాయి. స్పెషల్ గా చెబుకోవాల్సింది యూఎస్ మార్కెట్ లో “కుబేర” అందుకుంటున్న స్పందన. అక్కడ ఈ సినిమా ఇప్పటికే 2.4 మిలియన్ డాలర్ల మార్క్ దాటేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఈ సినిమాకి బలం ఇచ్చింది కేవలం కథ కాదు, నటీనటుల అభినయంతో పాటు టెక్నికల్ వర్క్ కూడా బాగా ఎలివేట్ అయ్యింది. జిమ్ షర్బ్ హీరోకి ఎదురైన విలన్ పాత్రలో శక్తివంతంగా కనిపించగా, దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకి ఓ స్పెషల్ వేటేజ్ ఇచ్చింది. “కుబేర” సినిమా నిర్మాణ బాధ్యతలు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమిగోస్ క్రియేషన్స్ కలిసి నిర్వహించాయి.

మొత్తానికి, థియేటర్ల దగ్గరనే కాదు, ఓవర్సీస్ మార్కెట్ లో కూడా “కుబేర” రన్ చూస్తుంటే, ఈ సినిమా ఇంకా ఎంత దూరం వెళ్తుందో చెప్పలేం. శేఖర్ కమ్ముల మార్క్ స్టోరీటెల్లింగ్ మరోసారి క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, కమర్షియల్ గా కూడా హిట్ ఇవ్వగలదని నిరూపించింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles