టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ సినిమా “కింగ్డమ్” చుట్టూ ఇటీవలి కాలంలో మంచి బజ్ నెలకొంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం మొదటి నుంచి చాలా ఆసక్తి కలిగిస్తోంది. కానీ వాయిదాలు పడుతుండటంతో అభిమానుల్లో కాస్త నిరాశే కలిగింది.
ఇటీవలే జులై 25న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలన్న నిర్ణయాన్ని మేకర్స్ ప్రకటించారు. కానీ తాజా పరిస్థితుల ప్రకారం ఆ తేదీన సినిమా రావడం కాస్త కష్టమేనన్న అభిప్రాయం ఫిలింనగర్ వర్గాల్లో వినిపిస్తోంది. కారణం, ఒక రోజు ముందే అంటే జూలై 24న పవన్ కళ్యాణ్ నటించిన భారీ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “హరిహర వీరమల్లు” రిలీజ్ కానుంది.
ఈ రెండు సినిమాలు ఒకే సమయంలో బాక్సాఫీస్‌లో కలిపివస్తే ఔట్‌పుట్‌పై ప్రభావం పడే అవకాశం ఉండడంతో కింగ్డమ్ మేకర్స్ తమ విడుదల తేదీని మార్చాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం, సినిమా విడుదల తేదీని జూలై 31కి మార్చే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.
దీనివల్ల ఆగస్టు 14న రిలీజ్ కాబోతున్న భారీ సినిమాలకు రెండు వారాల ముందు ఓ క్లియర్ విండో దొరుకుతుందని, ఈ గ్యాప్ “కింగ్డమ్”కు బాగా ఉపయోగపడుతుందని నిర్మాత నాగవంశీ భావిస్తున్నట్లు టాక్. ఈ గ్యాప్‌లో సినిమాను ప్రమోట్ చేసుకునే అవకాశం ఉండటంతో, ఆ తర్వాత తన ఫోకస్ “వార్ 2″పై పెట్టవచ్చని కూడా ఆయన అభిప్రాయం.
ఇప్పుడు అసలు ప్రశ్న ఎప్పుడైనా ఇదే డేట్ ఫిక్స్ అవుతుందా అనే దానిపైనే. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిన అవసరం ఉన్నప్పటికీ, జూలై 31న సినిమా థియేటర్లలోకి రానుందని అభిమానుల్లో మాత్రం పాజిటివ్ బజ్ మొదలైంది.
