తమ్ముడు ఎఫెక్ట్ ఎల్లమ్మ మీద పడనుందా!

Thursday, December 11, 2025

హీరో నితిన్ నటించిన తాజా సినిమా తమ్ముడు ఇటీవల థియేటర్లలోకి వచ్చింది. జూలై 4న గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమాకు మొదట మంచి అంచనాలే ఉన్నాయి. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. అయితే, రిలీజ్ అయిన మొదటి రోజే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై నిరాశ వ్యక్తమవుతోంది. సోషల్ మీడియా లో స్పందన చూస్తే నెగెటివ్ టాక్ ఎక్కువగా కనపడుతోంది.

ఇలాంటి పరిస్థుతుల్లో ఈ సినిమా నితిన్ కెరీర్‌లో మరో ప్లాప్‌గా మారబోతోందన్న అభిప్రాయం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక ఈ ఫలితం నితిన్ చేస్తున్న తదుపరి ప్రాజెక్టుపై ఎలా ప్రభావం చూపుతుందా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. బలగం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వేణు ఎల్దండి డైరెక్షన్‌లో నితిన్ మరో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా పేరు ఎల్లమ్మ. ఈ సినిమాను కూడా దిల్ రాజు బ్యానర్‌లోనే రూపొందించబోతున్నారు.

కానీ తాజా పరిస్థితుల్లో తమ్ముడు ఫలితాన్ని చూసి నిర్మాత దిల్ రాజు మరలా నితిన్‌తో సినిమా చేయడానికి ముందుకు వస్తారా అనే చర్చ ఇప్పుడు సినీ వర్గాల్లో జరుగుతోంది. నితిన్ స్థానంలో వేరే హీరోను తీసుకునే అవకాశం ఉందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎల్లమ్మ సినిమాకు సంబంధించి పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికి మాత్రం ఈ విషయమై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles