టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ సీనియర్ హీరోల్లో ఒకరిగా పేరు పొందిన విక్టరీ వెంకటేష్ ఇటీవలే సంక్రాంతికి విడుదలైన తన లేటెస్ట్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఆ విజయం తర్వాత వెంకీ మామ ఏ సినిమా చేస్తారు అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగిపోతుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సారి ఆయన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.
ఇద్దరి కాంబినేషన్ లో ఇదివరకే బాగానే ఎంటర్టైనింగ్ సినిమాలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు మళ్లీ కలసి పనిచేయబోతున్నారనే వార్త అభిమానుల్లో మంచి క్రేజ్ తెచ్చేస్తోంది. ఇప్పటికీ స్క్రిప్ట్ పనులు దాదాపుగా పూర్తి అయ్యాయట, షూటింగ్ కూడా త్వరలో మొదలయ్యే అవకాశం ఉందంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది.
ఇక ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ ఎవరు అనే విషయంపై ఆసక్తికర సమాచారం బయటకొచ్చింది. తాజా బజ్ ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నిధి అగర్వాల్ హరిహర వీరమల్లు, ది రాజా సాబ్ వంటి పెద్ద ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంటూ మంచి గుర్తింపు అందుకుంటోంది. ఇప్పుడు వెంకటేష్ సరసన నటించే అవకాశం రావడం ఆమె కెరీర్ లో మైలు రాయిగా మారుతుందని అభిమానులు భావిస్తున్నారు.
అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదుకాబట్టి ఇది ఎంతవరకు నిజమో తెలుసుకోవాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కానీ వెంకీ మామ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అవుతుండటం మాత్రం నిజం.
