రోప్ పార్టీ కావాలంట.. ఇదేం ఓవరాక్షనో?

Tuesday, December 9, 2025

వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గానీ, ఆయన అనుచర గణాలకు గానీ కోరిక ఒక్కటే.. ఏదో ఒక రాద్ధాంతం జరగాలి. రచ్చ చేయాలి. ‘జగన్ ను చంపేయడానికి కుట్రలు చేస్తున్నారు.. భద్రత ఇవ్వడం లేదు..’ అని నానా  యాగీ చేయడం. ప్రజల ముందు పోలోమని విలపించడం. ఏమీ జరక్కపోయినా సరే.. ఏదైనా జరిగిపోతున్నది అంటూ గోల చేయడం వారు తమ అలవాటుగా మార్చుకుంటున్నారు. ఇప్పుడు జగన్ పర్యటనల సమయంలో పోలీసులు రోప్ పార్టీ ఏర్పాటు చేయాలంటూ.. వైసీపీ నాయకులు ఏకంగా కోర్టుకెక్కడం గమనార్హం. జడ్ ప్లస్ భద్రత ఉన్న నాయకుడికి రోప్ పార్టీ కల్పించాలని, హెలిప్యాడ్ కోసం అనుమతి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. అయితే న్యాయస్థానం జడ్ ప్లస్ కేటగిరీ భద్రత విషయంలో పాటించాల్సిన నియమాలు, కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను తమ ముందుంచాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

జడ్ ప్లస్ కేటగిరీ కిందికి వచ్చే నాయకులకు 36 మందితో భద్రత కల్పిస్తారు. వారిలో కనీసం పదిమందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు ఉంటారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇస్తారు.  అంతే తప్ప.. వారు ఇంటినుంచి కదిలినప్పుడెల్లా వారికి రోప్ పార్టీ సమకూర్చాలనేది లేదు. నిజానికి జడ్ ప్లస్ కేటగిరీ కింద ప్రభుత్వం సూచించే మార్గదర్శకాలకు భిన్నంగా వ్యవహరిస్తే.. వాటిని ధిక్కరించినందుకు జగన్ దళాలు ఎప్పుడో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్లు నడిపి ఉండేవి. ఎందుకంటే.. అధికారం కోల్పోయిన తొలినాటినుంచి తనకు రక్షణ తగ్గిపోయందో.. అంటూ గోల చే స్తున్న జగన్మోహన్ రెడ్డి.. ఈ పాయింటును వాడుకోకుండా వదిలే వారు కాదు.

నిబంధనల్లో లేకపోయినప్పటికీ.. రోప్ పార్టీ కావాలనేది వారి కోరిక. జగన్ ఎంతటి అహంకార, భూస్వామ్య భావజాలంతో బతుకుతున్నారంటే.. తాను ఇంటినుంచి కదిలితే.. తన వాహనం ఎదురుగా పోలీసులు ఇరువైపులా తాడు పట్టుకుని.. తనకు రక్షణగా పరుగులుతీస్తూ ఉండాలన్నమాట. అలాంటి అసహ్యకరమైన పెత్తందారీ పోకడను ఆయన కోరుకుంటున్నారు. అందుకే ప్రతిసారీ రోప్ పార్టీ కావాలంటూ గోల చేస్తున్నారు. నిబంధనల్లో ఉంటే పోలీసులే ఇస్తారు. లేనప్పుడు అడిగినా ఇవ్వరు. ఇవ్వకపోయినా తనకు రోప్ పార్టీ కావాలనుకుంటే.. సినిమా సెలబ్రిటీల్లాగా బౌన్సర్లను అద్దెకు తీసుకుని రోప్ పార్టీగా వారిని వాడుకోవచ్చు. అందుకు వారికి పుష్కలంగా అధికారం ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డబ్బుకు గతిలేని పార్టీ ఏమీ కాదు కదా.. అనేది పలువురి వాదన. కానీ జగన్ కోరిక ఏంటంటే.. తన పార్టీ డబ్బు కూడా ఖర్చు పెట్టకూడదు అని. అందుకే ఈ గోల చేస్తున్నారనేది జనాభిప్రాయంగా ఉంది.

జగన్ ప్రధానంగా తన దృష్టిని ప్రజల సమస్యల మీద పెట్టడం లేదు. తాను వెళుతున్న ప్రతి చోటకూ.. వేల మందిని పోగేయాలని స్థానిక నాయకుల్ని పురమాయించడం ఆపడం లేదు. తనను చూసి జనం ఎగబడి వస్తున్నారని చాటుకోవడం ఆయనకు ఒక ముచ్చట. అందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని.. సమస్యలను పరిశీలించడానికి వెళుతున్నప్పుడు కిరాయి మూకలను తోలించడం తగ్గిస్తే.. అన్ని సమస్యలు సెట్ అవుతాయని ప్రజలు అంటున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles