ఒకరేమో గుండెపోటుతో చనిపోయారు. ఆయన మరణం జగన్ రెంటపాళ్లకు వస్తున్న రోజున సంభవించడం యాదృచ్ఛికమే కావొచ్చు. లేదా తమ ప్రియతమ నాయకుడు జగన్ తమ ఊరికి వస్తున్నారనే సంతోషం పట్టలేక గుండె ఆగిపోయి ఉండొచ్చు.కానీ.. ఇది రాజకీయ రంగం గనుక.. ఒకరి మీద ఒకరు చావు కారణాలను నెట్టేయడానికి పార్టీలు సాకులు వెతకవచ్చు. ఏది ఏమైనప్పటికీ.. ఒకరిది గుండెపోటు మరణం. కానీ.. రెండో మరణం అలాంటిది కాదు. స్వయంగా జగన్ ప్రయాణిస్తున్న కారు కింద పడి, ఆయన సొంత పార్టీకి చెందిన కార్యకర్త,. దళిత వృద్ధుడు చీలి సింగయ్య మరణించాడు. అది మామూలు మరణం కాదు, జగన్ దురహంకారం, జగన్ డ్రైవరు నిర్లక్ష్యం,జగన్ పార్టీ కార్యకర్తల్లో కూడా కనీస మానత్వం కూడా లేకపోవడం వల్ల జరిగిన మరణం. కానీ.. ఈ రెండు మరణాలను ఒకటే గాటన కట్టేయడానికి.. రెండూ ఒకటే అని తీర్మానించడానికి ఇప్పుడు జగన్ దళాలు ప్రయత్నిస్తున్నాయి. మరణినంచిన ఈ ఇద్దరి కుటుంబాలకు చెందిన వారిని తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుని వారికి చెరి పదిలక్షల రూపాయలు ఇచ్చి పంపడం విస్తుగొలుపుతోంది.
జగన్ రెంటపాళ్ల పర్యటన నాడు జయవర్ధన్ రెడ్డి అనే పార్టీ కార్యకర్త గుండెపోటుతో మరణించారు. చీలి సింగయ్య ఎలా మరణించాడో అందరికీ తెలుసు.
చీలి సింగయ్య మరణం గనుక లేకపోతే.. జయవర్దన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ మళ్లీ ఒక ఓదార్పు యాత్ర పెట్టుకుని ఉండేవారేమో తెలియదు. కానీ చీలి సింగయ్య స్వయంగా తన కారు కింద పడడం వల్లనే మరణించిన తర్వాత.. వెళితే రెండు కుటుంబాల వద్దకు వెళ్లాలి. కానీ సింగయ్య కుటుంబం వద్దకు వెళితే.. ఉద్రిక్తతలు ఎలా ఉంటయో తెలియదు. అందుకు భయపడి.. ఈ రెండు కుటుంబాల వారిని జగన్ తన ప్యాలెస్ కే పిలిపించుకున్నారు. అదికూడా.. ఈ కేసులో ఆయన మీద విచారణ ఆపివేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత.. సింగయ్య కుటుంబం కన్నీళ్లు తుడవడానికి జగన్ కు కాస్త తీరిక దొరికింది.
అయితే ఈ ఇద్దరి కుటుంబాలకు కూడా చెరి పదిలక్షల రూపాయలు ఇవ్వడం కార్యకర్తలకే ఆశ్చర్యం కలిగిస్తుంది. సింగయ్య కుటుంబానికి ఎక్కువ డబ్బు ఇస్తే పబ్లిక్ లో భ్రష్టుపట్టిపోతాం అనే భయం జగన్ కు ఉండి ఉండవచ్చు. కనీసం సింగయ్య కుటుంబాన్ని ఆదుకునే దిశగా.. ఏదైనా మాట హామీ ఇచ్చిఉన్నా బాగుండేదని అనుకుంటున్నారు. ఊరందరితోనూ అన్నట్టుగా మీకు అండగా ఉంటాం అనడం తప్ప.. ప్రత్యేకంగా ఏం చేయలేదని వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ పాటిస్తున్న ప్రమాణాలు ఆయన వైఖరిని చాటిచెబుతున్నాయని అనుకుంటున్నారు.
ఆ రెండు చావులూ ఒక్కటేనా జగన్!
Friday, December 5, 2025
