పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న “కన్నప్ప” సినిమా ప్రస్తుతం మరో కీలక విషయంతో వార్తల్లో నిలిచింది. మంచు విష్ణు హీరోగా, ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను శ్రద్ధగా తెరకెక్కిస్తున్నారు.
ఇక తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, ఈ సినిమా హిందీ శాటిలైట్ హక్కులు భారీ డీల్‌కు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ముంబైకి చెందిన ప్రముఖ ఏజెన్సీ ఈ హక్కులను దక్కించుకోడానికి 20 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు ఫిలింనగర్ టాక్. ఈ మొత్తం కేవలం శాటిలైట్ హక్కులకు మాత్రమే అంటే, ఓటిటి హక్కులకు ఇంకెంత మొత్తంలో డీల్ కుదురుతుందో అనే ఉత్కంఠ మొదలైంది. ఎందుకంటే ఓటిటి ప్లాట్‌ఫామ్స్ ఇప్పటివరకు ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదన్న సమాచారం ఉంది.
ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న వ్యక్తి స్టీఫెన్ డేవెస్సి కాగా, ప్రొడక్షన్ బాధ్యతలను స్వయంగా మోహన్ బాబు చూసుకుంటున్నారు. మొత్తానికి ఓటిటి డీల్ ఇంకా ఫిక్స్ కాకముందే, శాటిలైట్ హక్కులకు మాత్రమే ఇంత భారీ మొత్తం రావడం సినిమాపై ఉన్న హైప్‌ను స్పష్టంగా తెలియజేస్తోంది. త్వరలో ఓటిటి విషయానికీ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
