వార్‌ మొదలైంది!

Friday, December 5, 2025

టాలీవుడ్ మాస్ కింగ్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టైలిష్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి తెరపై కనిపించబోతున్న భారీ మల్టీస్టారర్ సినిమా “వార్ 2”పై అంచనాలు అసాధారణంగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని బిగ్ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఏర్పడగా, తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకి వచ్చింది.

వార్ 2 లో ఎన్టీఆర్, హృతిక్ లు యాక్షన్ లోనే కాదు డాన్స్ లోనూ తమ టాలెంట్ చూపించనున్నారు. ఈ ఇద్దరు స్టార్స్ డాన్స్ పరంగా ఎంతటి ఎనర్జీతో స్టేజ్‌పై కనిపిస్తారో అందరికీ తెలుసు. ఇప్పుడు వారిద్దరూ కలిసి ఓ శాందార్ డాన్స్ నెంబర్ కోసం తలపడుతున్నారు. గత కొన్ని రోజులుగా ముంబయిలోని యష్ రాజ్ స్టూడియోస్ లో ఈ సాంగ్‌కు సంబంధించి కసరత్తులు ముమ్మరంగా జరిగాయి. ఫైనల్ గా ఈ డ్యాన్స్ నెంబర్ షూటింగ్ ఈరోజు సెట్స్ పై ప్రారంభమైందట.

ఇద్దరు టాప్ స్టార్స్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటూ డాన్స్ చేయడం ప్రేక్షకులకు ఓ స్పెషల్ విజువల్ ట్రీట్ లాంటి విషయమే. యాక్షన్ సీన్‌లు, డ్యాన్స్ నంబర్‌తో కూడిన ఈ చిత్రం ఎంత ఎగ్జయిటింగ్‌గా ఉంటుందో అనేది చూస్తే, ఫ్యాన్స్ మాత్రం ఇప్పటినుంచే థియేటర్స్ లో ఆ మేజిక్‌కి సిద్ధమవుతున్నారు.

వార్ 2 లో ఇద్దరు స్టార్స్ కలసి చూపించబోయే పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే. కానీ ప్రస్తుతం ఉన్న హైప్ చూస్తుంటే ఈ సినిమా బిగ్ స్క్రీన్ పై ఓ గ్రాండ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేదే అనే గ్యారెంటీ ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles