కుబేర డామినేషన్ మామూలుగా లేదుగా!

Friday, December 5, 2025

టాలీవుడ్‌లో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించిన సినిమా ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

శేఖర్ కమ్ముల తన స్టైల్‌కు తగ్గట్టుగానే సినిమా టేకింగ్‌ను సింపుల్‌గా కానీ హృదయాన్ని తాకేలా డిజైన్ చేశాడు. సినిమాలోని భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకుల గుండెల్లో ముద్రపడ్డాయంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా కుటుంబ సంబంధాల నేపథ్యంలో సాగే కథా తంతు, ఎమోషనల్ కంటెంట్ ఈ సినిమాను మరింత బలంగా నిలబెట్టాయి.

ప్రస్తుతం ఈ సినిమా రెండో వారంలోకి అడుగుపెట్టింది. కానీ వసూళ్ల పరంగా మాత్రం దూసుకుపోతూనే ఉంది. రెండో ఆదివారం రోజే బుక్ మై షోలో ఈ సినిమాకు 67 వేలకుపైగా టికెట్లు బుకింగ్ కావడం ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఎంత క్రేజ్ ఉందో చూపిస్తోంది.

ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా సినిమాకు ప్లస్‌గా పనిచేసింది. బీజీఎమ్‌తో పాటు పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మొత్తానికి ఈ మూవీ తెలుగు బాక్సాఫీస్ వద్ద ఓ సాలిడ్ హిట్‌గా నిలవడం ఖాయం అనే మాటను ట్రేడ్ వర్గాలు ధృవీకరిస్తున్నాయి.

ఇప్పటికే ఈ సినిమా వసూళ్ల పరంగా స్ట్రాంగ్‌గా కొనసాగుతోంది. ఫుల్ రన్ పూర్తయ్యే లోపు ఇంకెంత కలెక్షన్స్ అందుకుంటుందా అన్నది ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles