టాలీవుడ్‌కి చెందిన టాలెంటెడ్ నటుల్లో అల్లరి నరేష్‌కి తనదైన స్థానం ఉంది. కామెడీతో అందరిని నవ్వించే గుణం మాత్రమే కాదు, అవసరమైతే భావోద్వేగ సన్నివేశాల్లో కూడా ప్రేక్షకుల మనసును తాకేలా నటించే శక్తి ఉంది అతనిలో. గత కొన్ని సినిమాలుగా బలమైన కంటెంట్ ఉన్న కథలతోనే నరేష్ ముందుకు వస్తున్నాడు. ఇప్పుడు అతని కెరీర్‌లో 63వ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెలుగులోకి వచ్చింది.
ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్‌ను కూడా రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. జూన్ 30న వీటిని విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. టైటిల్ ఎలా ఉంటుందో, లుక్ లో నరేష్ ఎలా కనిపిస్తాడో అనే ఆసక్తి ఇప్పటికే ఫ్యాన్స్ లో మొదలైపోయింది.
ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను మెహర్ తేజ్ తీసుకుంటుండగా, నిర్మాణం విషయానికి వస్తే టాలీవుడ్‌లో అనేక విజయవంతమైన సినిమాలను అందించిన సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకార స్టూడియోస్ వంటి బ్యానర్లు కలిసి ఈ సినిమాను నిర్మించనున్నాయి.
ఇంత వరకు కామెడీకి మాత్రమే పరిమితమయ్యాడనుకునే వారి అభిప్రాయాన్ని తన సీరియస్ పాత్రలతో మార్చేసిన అల్లరి నరేష్, ఇప్పుడు మరో కొత్త కథతో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి
