టాలీవుడ్ యూత్ హీరో నితిన్ నటిస్తున్న తాజా సినిమా “తమ్ముడు” ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించగా, సప్తమి గౌడ మరియు వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సీనియర్ నటి లయ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు సినిమాపై మంచి అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటంతో హైప్ మరింత పెరిగింది. ఇదే సమయంలో మేకర్స్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా బయటకు వచ్చింది. సినిమా పూర్తయిన తర్వాత సెన్సార్ కార్యక్రమాలు ముగించుకుని, దీనికి ఏ సర్టిఫికెట్ వచ్చిందని అధికారికంగా వెల్లడించారు. అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఈ సర్టిఫికెట్ విషయమై కొంత ఆశ్చర్యం కలిగినట్టు చెప్పొచ్చు.
ఇక ఈ సినిమాకు సంగీతం అందించిన అజనీష్ లోకనాథ్ ఇప్పటికే విడుదలైన పాటలతో ఆకట్టుకున్నారు. నిర్మాణ బాధ్యతలు దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా చేపట్టారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తమ్ముడు చిత్రం జూలై 4న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
