బన్నీ లేకుండానే ఐకాన్ రెడీ అవుతుందంట..!

Friday, December 5, 2025

టాలీవుడ్‌లో నితిన్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా తమ్ముడు విడుదలకు సిద్ధమవుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 4న గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ ఏర్పడగా, ప్రమోషన్లలో భాగంగా నిర్మాత దిల్ రాజు ఆసక్తికర విషయాలు షేర్ చేశాడు.

ఈ సందర్భంగా దిల్ రాజు గతంలో ప్రణాళిక వేసుకున్న ఐకాన్ అనే ప్రాజెక్టు మరోసారి చర్చలోకి వచ్చింది. అప్పట్లో ఈ సినిమాను అల్లు అర్జున్‌తో తీస్తామంటూ అధికారికంగా ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ముందుకు కదలలేదు. అల్లు అర్జున్ పుష్ప సిరీస్‌తో పూర్తిగా బిజీ అవ్వడంతో ఐకాన్ మొదలయ్యే అవకాశాలు తగ్గిపోయాయి.

అలాగే ఇది పూర్తిగా షెల్వ్ అయ్యిందని, ఇక మళ్లీ మొదలయ్యే అవకాశాలు లేవంటూ సినీ వర్గాల్లో టాక్ కూడా వినిపించింది. కానీ ఈ గాసిప్‌కి ఫుల్‌స్టాప్ పెడుతూ దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు. ఐకాన్ సినిమా ఉండదనే మాటలో నిజం లేదని, కచ్చితంగా ఇది తెరకెక్కుతుందంటూ స్పష్టం చేశాడు.

అయితే ఇప్పుడు ఈ సినిమాకి అల్లు అర్జున్ బదులు మరో హీరోను తీసుకోవాలని దిల్ రాజు నిర్ణయించారట. త్వరలోనే ఈ ప్రాజెక్టును కొత్త నటుడితో ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు. దీంతో ఈ కొత్త హీరో ఎవరు అనే విషయంపై సినీప్రేమికుల్లో ఆసక్తి పెరిగింది. మరి అల్లు అర్జున్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అనేది చూడాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles