ధనుష్, నాగార్జున కాంబినేషన్‌లో శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘కుబేర’ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. ఇప్పుడు సూపర్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. వసూళ్ల పరంగా సాలిడ్ ఫిగర్స్‌ను నమోదు చేస్తోంది.
ప్రతిరోజూ థియేటర్ల వద్ద ఈ సినిమాకు క్రేజ్ మరింత పెరుగుతూ ఉండటం గమనార్హం. ముఖ్యంగా టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షో లో ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు 1 మిలియన్‌కి పైగా టికెట్లు అమ్ముడవడం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర బృందమే అధికారికంగా ప్రకటించింది.
అంతేకాదు, ఇంకా పలు చోట్ల టికెట్లు ఫాస్ట్‌గా బుక్ అవుతుండటంతో.. ‘కుబేర’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ర్యాంపేజ్ కొనసాగిస్తోందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ఒక స్పెషల్ మెసేజ్ కూడా షేర్ చేసింది:
“థియేటర్లు ఉత్సాహంగా ఉన్నాయి, ప్రేక్షకుల హృదయాలు గర్జిస్తున్నాయి, స్క్రీన్లు వెలుగుతున్నాయి.. కుబేర ఒక అద్భుతమైన మెగా బ్లాక్‌బస్టర్” అని వారు పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉన్న క్రేజ్‌ను బట్టి చూస్తే.. ‘కుబేర’ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను తుడిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
