టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం పైన మెల్లగా కానీ పక్కా ఫోకస్‌తో షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం వర్కింగ్ టైటిల్‌గా మెగా 157 అనే పేరు పెట్టుకున్నారు. సంక్రాంతి 2026ని లక్ష్యంగా చేసుకుని ఈ సినిమాను త్వరితగతిన పూర్తి చేసే పనిలో ఉన్నారు.
ఇప్పుడు చిత్ర యూనిట్ ముస్సోరిలోని రెండో షెడ్యూల్‌ని పూర్తిచేసింది. అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరించగా, చిరంజీవి పాల్గొన్న హై ఎనర్జీ సీన్స్‌కి స్పెషల్ గా ప్లానింగ్ చేశారట. ఈ షెడ్యూల్‌కి గ్లామర్ అదనం కలిపేందుకు నయనతార కూడా షూటింగ్లో పాల్గొంది.
ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా భీమ్స్ సిసిరోలియో పనిచేస్తున్నాడు. నిర్మాతలుగా సాహు గారపాటి, సుస్మిత కొణిదెల కలిసి ఈ ప్రాజెక్ట్‌కి బిగ్ సపోర్ట్ అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పేస్ చూస్తుంటే, ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్‌కి త్వరలోనే పాజిటివ్ అప్డేట్స్ వస్తాయని ఆశించవచ్చు.
