థియేటర్లలో ఇటీవలే విడుదలైన చిత్రాల్లో ఒకటిగా “కుబేర” పేరుతో వచ్చిన సినిమా మంచి అటెన్షన్ దక్కించుకుంది. ధనుష్, నాగార్జునలు కలిసి నటించడంతోనే ఈ ప్రాజెక్ట్ మీద ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కావడం విశేషం.
రిలీజ్ కి ముందు నుంచే ఈ సినిమా చుట్టూ హైప్ కనిపించింది. దాంతో అన్ని భాషలలో కలిపితే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా దాదాపు 60 కోట్లకు పైగా బిజినెస్ చేసినట్టు సమాచారం. ఇందులో ఎక్కువ భాగం మన తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. ఆశ్చర్యకరంగా తమిళ్ వర్షన్ లో తక్కువ బిజినెస్ జరిగినట్టు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
ఇప్పుడు “కుబేర” బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ అయ్యేలా చూడాలంటే దాదాపు 120 కోట్లకుపైగా వసూళ్లు అవసరం. ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన బాగానే ఉంది కానీ, సినిమాకు ముందు ఉన్న బజ్ స్థాయిలో కలెక్షన్స్ కొనసాగిస్తేనే అసలైన విజయం దక్కే అవకాశం ఉంటుంది. ఇక ముందు రోజుల్లో ఈ సినిమా ఏ మేరకు పెర్ఫామెన్స్ చేస్తుందో చూడాలి.
