ఆపుతారా…ఇక..సమంత సీరియస్‌!

Friday, December 5, 2025

స్టార్ హీరోయిన్ సమంతకు అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఎక్కడ కనిపించినా అభిమానులు, మీడియా ఫొటోగ్రాఫర్లు వెంటపడటం చూస్తూనే ఉంటాం. అయితే ఈ రకమైన క్రేజ్ ప్రతి సారి హీరోయిన్లకు కంఫర్ట్‌గా అనిపించదు. తాజాగా సమంత ఎదుర్కొన్న ఒక సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు కేంద్రంగా మారింది.

ఇటీవల జిమ్‌లో వర్కౌట్ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన సమంతను అక్కడే ఉన్న మీడియా ఫొటోగ్రాఫర్లు చుట్టుముట్టారు. ఆ సమయంలో ఆమె ఫోన్‌లో బిజీగా ఉండగా కూడా ఫోటోలు తీయడంపై ఆమె అసహనం వ్యక్తం చేసింది. ఒక్కసారిగా సీరియస్ అయ్యిన సమంత ఫోటోగ్రాఫర్ల దూరంగా ఉండమని కోరిందట.

ఆమెకి ఎదురైన ఈ అనుభవంపై అభిమానులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత సమయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా విస్తరిస్తోంది.

ఇలాంటి సందర్భాలు చాలా మంది సెలబ్రిటీలకు నిత్యకృత్యం అయిపోయాయి. క్రేజ్ పెరిగినకొద్దీ ప్రైవసీ తగ్గిపోతుండడాన్ని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles