అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ తో పకడ్బందీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ అఖిల్ లుక్‌పై మంచి బజ్ తీసుకొచ్చింది. పూర్తిగా మాస్ షేడ్స్‌తో అఖిల్ స్క్రీన్ పై కొత్తగా కనిపించనున్నాడు.
తాజాగా ఈ సినిమాకు ‘లెనిన్’ అనే టైటిల్‌ను ఫైనల్ చేసినట్టు సమాచారం. టైటిల్ ఆసక్తికరంగా ఉండటంతో పాటు కథకు బాగా సరిపోతుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో అఖిల్‌కు తండ్రి పాత్ర కూడా ఓ కీలకంగా ఉండబోతోంది. ఈ పాత్ర కోసం నాగార్జునను తీసుకుంటున్నారన్న వార్తలు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్‌గా మారాయి. రియల్ లైఫ్‌లో తండ్రీ కొడుకులు అయిన అఖిల్, నాగార్జున… రీల్ లైఫ్‌లో కూడా అదే రోల్స్ లో కనిపించబోతున్నారన్న వార్త అభిమానుల్లో ఎంతగానో ఆసక్తిని కలిగిస్తోంది.
నాగ్ పాత్రను దర్శకుడు చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. అఖిల్ కెరీర్‌కు మళ్లీ బలమైన బూస్ట్ ఇవ్వగల కథతో ఈ సినిమా రాబోతుందని టాక్.
ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తుండగా, సంగీతాన్ని థమన్ అందిస్తున్నాడు. నిర్మాణం విషయానికి వస్తే నాగవంశీతో పాటు అక్కినేని నాగార్జున కూడా ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఓ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే యాక్షన్ డ్రామాగా ఈ కథ రూపొందింది. అఖిల్ కెరీర్‌కు ఇది గేమ్ ఛేంజర్‌గా మారుతుందా అనే చర్చలు ఇప్పటికే మొదలయ్యాయి.
