మాస్ మహారాజా రవితేజ ఫుల్ జోష్‌లో సినిమాలు చేస్తూ వరుసగా ప్రాజెక్టులు అంగీకరిస్తున్నాడు. ఇప్పుడే ‘మాస్ జాతర’ మూవీ పనుల్లో బిజీగా ఉన్న రవి, తాజాగా మరో కొత్త సినిమా కోసం సెట్లో అడుగుపెట్టాడు. ఈసారి దర్శకుడు కిషోర్ తిరుమలతో కలిసి పని చేస్తున్నాడు.
ఇది రవితేజకి 76వ సినిమా కావడంతో సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్ షూటింగ్ హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌లో మొదలైనట్టు తెలుస్తోంది. షూటింగ్ సోమవారం నుంచి ప్రారంభమయ్యింది. ఇందులో రవితేజతో పాటు ఇతర ముఖ్య పాత్రధారులు కూడా పాల్గొంటున్నారు. మొదటి షెడ్యూల్‌లోనే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు టాక్.
సినిమా పనులు త్వరగా పూర్తి చేసి థియేటర్లకు తీసుకురావాలని యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది. టైటిల్, ఫస్ట్ లుక్ విషయాలపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
