కిరణ్‌ అబ్బవరం …స్పీడ్‌ పెంచాల్సిందే!

Friday, December 5, 2025

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల ‘క’ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమాతో అతని కెరీర్‌లో సాలిడ్ బ్లాక్‌బస్టర్ ఒకటి వచ్చిందనే చెప్పాలి. అయితే ఆ తర్వాత వచ్చిన ‘దిల్‌రూబా’ మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ రెండు సినిమాల మధ్య వచ్చిన గ్యాప్, ప్రొడక్షన్ స్టేజ్‌లో తీసుకున్న టైమ్‌ గురించి ఇప్పుడు చర్చలు సాగుతున్నాయి.

ఇప్పుడు కిరణ్ ‘K ర్యాంప్’ అనే సినిమా మీద ఫోకస్ చేస్తున్నాడు. ఇది ఇంకా పూర్తి కాకముందే, తన తదుపరి చిత్రంగా ‘చెన్నై లవ్ స్టోరీ’ అనే కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించేశాడు. కానీ ఇక్కడే కొంత విమర్శ వస్తోంది. సినిమాలను ప్రకటించడం కంటే వాటిని సమయానుకూలంగా పూర్తి చేయడమే ముఖ్యమన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఒక సినిమాకు రెండు సంవత్సరాలు పడుతున్న పరిస్థితి వల్ల థియేటర్లలో కంటెంట్ కొరత ఏర్పడుతుందని, మధ్య తరహా చిత్రాలు ఆలస్యం కావడం వల్ల డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఇబ్బందులు పడుతున్నారని పలువురు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

తాజాగా వస్తున్న కామెంట్ల ప్రకారం, స్టార్ హీరోలు కాకపోయినా, మిడ్ రేంజ్ హీరోలైతే తక్కువ టైంలో సినిమాలు పూర్తి చేయాలి అనే ఒత్తిడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కిరణ్ అబ్బవరం కూడా తన స్పీడ్ పెంచాలని, వరుస సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలని కొందరు సూచిస్తున్నారు. ఇలాంటి విమర్శలపై కిరణ్ ఎలా స్పందిస్తాడో చూడాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles